చిట్ ఫండ్ కేసులో అరెస్ట్ అయిన, జగజ్జనని చిట్‍ఫండ్ అధినేతలు, అలాగే టిడిపి నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు ఇద్దరికీ కూడా హైకోర్టు, కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా పది రోజులు క్రితం, చిట్ ఫండ్స్ డబ్బు వేరే అవసరాలకు వాడారు అంటూ, వీరి ఇద్దరినీ కూడా, సిఐడి అరెస్ట్ చేసింది. దీంతో ఇద్దరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసుని తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి వేసిన పిటీషన్ ని, రాజమండ్రి సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ నేపధ్యంలోనే ఇద్దరూ హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. వారం రోజుల క్రితమే బెయిల్ పిటీషన్ దాఖలు చేయటం, సీనియర్ న్యాయవాదులు దమ్మలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వీరికి చిట్ ఫండ్ చట్టం వర్తించదు అని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని వాదించారు. ఈ వాదనలు విన్న తరువాత, కోర్ట్ బెయిల్ ఇచ్చింది. అయితే ఇదంతా కావాలనే కక్ష సాధింపు చర్యల్లోనే, ఇలా చేసారని టిడిపి ఆరోపించింది. చంద్రబాబు కూడా జైలుకి వెళ్లి, వీరిని పరామర్శించిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read