ఐపీఎల్-ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్లో ఆడిన అంబ‌టిరాయుడుని జేపీఎల్-జ‌గ‌న్ పొలిటిక‌ల్ లీగ్‌లో చేరుతున్నాడు. ఇటీవ‌ల వ‌ర‌స‌గా వైకాపా పాల‌న‌ని, సీఎం జ‌గ‌న్ రెడ్డిని ప్ర‌శంసిస్తూ ట్వీట్లు చేస్తున్న అంబ‌టిరాయుడు అంద‌రూ ఊహిస్తున్న‌ట్టే సీఎం జగన్ ను కలిశాడు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన అంబటి రాయుడు, నేడో రేపో వైకాపాలో చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. టీమిండియాకి ఆడిన క్రికెట‌ర్ అంబ‌టిరాయుడు త‌న ఆట‌కంటే ఎక్కువ‌గా నిత్యం వివాదాల‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉండేవాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ద‌క్కించుకున్న అంబ‌టి రాయుడు ఆట అంతంత మాత్ర‌మే. క్రికెట్ ఆట‌ని చాలించి పొలిటిక‌ల్ గేమ్ కి రెడీ అవుతూ జ‌గ‌న్  పొలిటిక‌ల్ లీగ్‌లో చేర‌డానికి స‌ర్వం సిద్ధం చేసుకున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.  దీనికంటే ముందు ఏపీ స‌ర్కారు కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌శంసిస్తూ అంబ‌టి ట్వీట్లు వేశారు. ఏపీ సీఎం చేసే ట్వీట్ల‌ను అంబ‌టి రాయుడు రీట్వీట్ చేయ‌డంతో వైకాపాతో టైఅప్‌లో ఉన్నాడ‌ని అంతా అనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు జగన్ శంకుస్థాపన సంద‌ర్భంగా సీఎం ప్రసంగాన్ని వైసీపీ ట్విట్టర్ నుంచి అంబటి రాయుడు  రీట్వీట్ చేశాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైకాపా ప్యాకేజీ పాలిటిక్స్ నుంచి బ‌య‌ట‌కొచ్చి ఏకంగా పోటీకి దిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఐపీఎల్ ని వీడి జేపీఎల్ లో చేరి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేందుకు ఉవ్విళ్లూరుతున్న అంబ‌టిరాయుడు ముసుగు తీసేసాడు. ఇన్నాళ్లు ట్విట్ట‌ర్ హ్యాండిల్ వైకాపాకి అద్దెకిచ్చిన అంబ‌టిరాయుడు ఇప్పుడు తానే జ‌గ‌న్ ఫ్రాంచైజీకి చిక్కాడని తేట‌తెల్లం అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read