కమ్మరావతి అన్న నోటితోనే వైకాపా నేతలు అమరావతి జపం చేస్తున్నారు. సెప్టెంబరులో విశాఖ వెళ్లి కాపురం చేస్తానంటున్న సీఎం అమరావతిలో పేదలకి ఇళ్లు ఇవ్వడమే తన జీవిత ధ్యేయం అంటున్నారు. అమరావతిలో ఏముంది శ్మశానం అంటూ ప్రవచించిన మంత్రి బొత్స పేదలకి ఆ శ్మశానంలోనే ఇళ్లు ఇవ్వడాన్ని గొప్పఘనతగా ప్రచారం చేస్తున్నారు. ఆర్-5 జోన్ పై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత తరువాత వైసీపీ నేతల వాయిస్ ఒక్కసారిగా మారిపోయింది. రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికి పరిమితం కాదు - రాజధాని ప్రజలందరిదని హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలతో వైసీపీ పెద్దలు అమరావతిపై ప్రేమ కురిపించేస్తున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామంటూ ప్రకటించేశారు. వాస్తవంగా అమరావతిలో 7876 మంది ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి.. రూ.650 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో టిడిపి ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం చేపట్టింది. మొదటి విడతగా, అమరావతి రాజధాని నగర పరిధిలో 8 చోట్ల మొత్తం 44 ఎకరాల్లో 157 బ్లాకుల్లో 5,024 ఫ్లాట్లు నిర్మాణం మొదలు పెట్టారు. ఇవి 80 శాతం నిర్మాణం పూర్తయ్యాయి. ఆ తరువాత వచ్చిన జగన్ సర్కారు ఈ ఇళ్లని నిరుపేద లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుబెట్టాయి. అత్యాధునిక షీర్‌వాల్ టెక్నాలజీతో, సకల సౌకర్యాలతో పేదలకు కట్టిన ఇళ్లు వారికి అప్పగించకుండా, రాజధానిలో ఇళ్లపట్టాలు ఇవ్వడానికి ఎందుకింత అత్యుత్సాహం చూపిస్తున్నారో అర్థంకావడంలేదని కొందరు అంటున్నారు. అమరావతి రాజధానే కాదని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంటున్నారు. తన రాజధాని విశాఖ అని ప్రకటించారు. అటువంటప్పుడు అమరావతిలో రైతులు రాజధానికి ఇచ్చిన భూముల్లో ఏ లక్ష్యంతో పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తున్నారో ఆలోచిస్తే, ఇట్టే అర్థమవుతుంది. ఇది జగన్ రెడ్డికి ఉన్న అమరావతిపై ద్వేషం, పేదలపై కోపం అని..
కమ్మరావతి అని నిన్నటి దాకా చెప్పిన అమరావతిలో, వైసీపీ కొత్త పాట చూసారా ?
Advertisements