కరకట్ట కమల్ హాసన్ అని టిడిపి వారు ముద్దుగా పిలుచుకునే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తోక కత్తిరించి పారేశారు జగన్ రెడ్డి. మంత్రి పదవి ఇవ్వకుండా జగన్ రెడ్డి తనను మోసం చేశారనే ఆగ్రహంతో ఉన్న ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చుట్టూ అసమ్మతులను మొహరిస్తున్నాడు. ఒకానొక దశలో షర్మిల వర్గంగా ఆర్కే బయటపడిపోయారు. దీంతో జగన్ మంగళగిరి ఎమ్మెల్యేని శత్రువుని చూస్తున్నట్టే వ్యవహరిస్తున్నాడు. షర్మిలని వైకాపా నుంచి కానీ, ఏపీ నుంచి ఎవరైనా కలిస్తే క్షణాల్లో జగన్ రెడ్డికి సమాచారం వచ్చేస్తోంది. షర్మిల చుట్టూ జగన్ నిఘా బృందాన్ని ఉంచారని ఇటీవలే డిఎల్ రవీంద్రారెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలతో రహస్య భేటీలు జగన్ దృష్టికి వచ్చాయి. మంగళగిరిలోనూ విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉందని, నారా లోకేష్‌ని తట్టుకుని నిలబడే శక్తి కోల్పోయారని ఆర్కే ని దూరం పెడుతూ వస్తున్నారు వైకాపా పెద్దలు. మంగళగిరి చేనేతవర్గానికి చెందిన నేతలని వైకాపాలో చేర్చుకుని ఆర్కేకి పొగబెట్టారు. మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి వంటి వారిని టిడిపి నుంచి తీసుకుని ఒకరికి ఎమ్మెల్సీ, ఇంకొకరికి ఆప్కో చైర్మన్ పోస్టులు కట్టబెట్టారు. వచ్చే ఎన్నికలకి వైకాపా టికెట్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదనే బలమైన సంకేతాలు పంపుతున్నారు జగన్. తన కొడుకు పెళ్లికి సీఎంని కనీసం ఆహ్వానించలేదు ఆర్కే. తన నియోజకవర్గం పరిధిలోనే ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఎమ్మెల్యేల సమీక్షకి కూడా హాజరు కాలేదు. ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వైకాపాలోనే వ్యతిరేక వర్గంగా ఉన్న దొంతి రెడ్డి వేమారెడ్డికి మంగళగిరి వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి ఆళ్ల రామకృష్ణారెడ్డికి పెద్ద దెబ్బే కొట్టింది వైసీపీ. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వ్యతిరేక వర్గానికి నాయకుడైన దొంతిరెడ్డికి పదవి కట్టబెట్టడం ముమ్మాటికీ ఆర్కే తోక కత్తిరించడమేనని వైసీపీలో టాక్ వినిపిస్తోంది. ఆర్కేకి పడనివారికి పదవులు కట్టబెడుతూ, ఆర్కేకి కుడిఎడమ భుజాల్లాంటి నేతలైన మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావును, తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి పదవుల నుంచి తొలగించారు. అంటే వైకాపా నుంచి ఇక తమరు దయ చేయొచ్చు అని ఆళ్ల రామకృష్ణారెడ్డికి డైరెక్టుగానే సంకేతాలు పంపేశారు జగన్ రెడ్డి.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తోక జగన్ ఎందుకు కత్తిరించారు ?
Advertisements