ముందస్తు ఎన్నికలకి జగన్ రెడ్డి మొగ్గు చూపిస్తున్నారని ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ప్రచురించారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న ప్రజా వ్యతికేతక, అప్పులు దొరకని స్థితిలో కేంద్రం ఆశీస్సులతో వైఎస్ జగన్ ముందస్తుకి వెళ్తారని ఆంధ్రజ్యోతి విశ్లేషణ. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతి ప్రచురితమైనవన్నీ నిజాలు కావడంతో ఇది కూడా వాస్తవమేనని అందరూ నమ్ముతున్నారు. ఆంధ్రజ్యోతి రాసిన కారణాలు కాకుండా ఏపీలో పరిణామాలు చూస్తుంటే ముందస్తుకి గ్యారెంటీగా వెళ్తారని తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్, డిఎస్పీల బదిలీలు రాష్ట్రమంతా చేపట్టడం ముందస్తుకి మొదటి సంకేతం. కొందరినైతే పోస్టులో చేరి నెల కాకుండానే ఎమ్మెల్యేలు చెప్పిన వారిని నియమించడం ఎన్నికలలో తమకి మద్దతుగా ఉండే అధికారులను వేయించుకోవడం చూస్తుంటే ముందస్తుకి వెళ్తారనే స్పష్టం అవుతోంది. మరోవైపు పేటీఎం మేధావులు, సెలబ్రిటీలు వరస పెట్టి ఏపీలో దిగబడుతున్నారు. సోషల్మీడియాలో ప్రత్యక్షమవుతున్నారు. ఇదంతా ముందస్తు కోసమేనని వేరే చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు ఎక్కడున్నారో తెలియని ముద్రగడ పద్మనాభం నిద్రలేచారు. ముంబైలో తాగి కాళ్లు నాకే రాంగోపాల్ వర్మ ఫుల్ టైమ్ వైసీపీ కోసం పనిచేయడానికి ఇక్కడే ఉంటున్నారు. అంబటి రాయుడు, శ్రీరెడ్డి, మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ప్రొఫెసర్ నాగేశ్వర్, జర్నలిస్ట్ సాయి, తెలకపల్లి రవి వంటి వారంతా గత కొద్దిరోజులుగా చాలా యాక్టివ్‌గా మారుతున్నారు. వీరంతా వైసీపీ కోసం పనిచేసే స్లీపర్ సెల్స్. ఇవి యాక్టివ్ అయ్యాయంటే ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నట్టేనని అర్థం.
ఆంధ్రజ్యోతి రాసిన వార్త నిజమేనా ? వైసీపీలో ఎందుకీ హడావిడి ?
Advertisements