ప్రకాశం జిల్లాలో టిడిపియే లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు తానే వైసీపీలో ఉంటాడో లేదో అన్న చందంగా తయారైంది పరిస్థితి. మంత్రిగా ఉన్నప్పుడు మాటలు కోటలు దాటేలా ప్రవర్తించిన బాలినేని ఇప్పుడు వైరాగ్యం ప్రవచిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు జిల్లాలో ఉన్న నాలుగు టిడిపి స్థానాలు వైసీపీ ఖాతాలో పడేసి, క్లీన్ స్వీప్ చేసి చూపిస్తానంటూ శపథం చేశారు. అనంతరకాలంలో మంత్రి పదవి ఊడబీకేశారు. ప్రాంతీయ సమన్వకర్త పదవి ఇచ్చారు. అది కూడా నామ్ కే వాస్తే చేయడంతో బాలినేని ఏకంగా పార్టీ నుంచే బయటకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. చాలా రోజులుగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న బాలినేని ఇటీవల జిల్లా పర్యటనకి వచ్చినప్పుడు అలిగారు. అయితే బాలినేనితో బటన్ నొక్కించి కూల్ చేసిన సీఎం, మనసులో అసంతృప్తిని చల్లార్చలేకపోయారు. తాజాగా సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన సందర్భంగా సీఎం పిలిచి మాట్లాడారు. తన బావ వైవీ సుబ్బారెడ్డి తనను ఎలా ఇబ్బందులు పెడుతున్నదీ బాలినేని సీఎంకి వివరించారు. సొంత జిల్లాలో తనకి ప్రాధాన్యత తగ్గించడంపై బాలినేని అధిష్టానానికి వివరించినా అటు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇక తెగతెంపులేనని తేలిపోయింది. చాలారోజులుగా బాలినేని జనసేనతో టచ్‌లోకి వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం జగన్ రెడ్డి కరెప్షన్ అంతా సెంట్రలైజ్ చేశాక, ఆయనకి తెలియకుండా తన వియ్యంకుడి భాస్కర్‌రెడ్డితో కలిసి వేలకోట్ల దందాలు చేస్తున్నారని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకి అనుమానాలు పొడసూపాయి. జాతీయ, అంతర్జాతీయ డీలింగ్స్, మంత్రిగా రష్యా పర్యటన, చెన్నైలో హవాలా సొమ్ముకోట్లు పట్టుబడటం, ట్రమడాల్ తయారీ సేఫ్ ఫార్మాలోనూ వాటాలు, మైత్రి మూవీ మేకర్స్‌లో పెట్టుబడులు ఇలా చాలా పెద్ద అవినీతి సామ్రాజ్యమే జగన్ రెడ్డికి విజిలెన్ష్‌కి దొరక్కుండా నిర్మించుకున్నారని జగన్ రెడ్డి అక్కసుతో ఉన్నారని సమాచారం. ఏపీలో దోచిన వేలకోట్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో లావాదేవీలతో తమని మించిపోయారనే కోపంతో ఉన్న జగన్ రెడ్డి చివరికి బాలినేనిని పొమ్మనకుండా పొగబెట్టారని తెలుస్తోంది.
టిడిపిని క్లీన్ స్వీప్ చేస్తానని ..క్లీన్ బౌల్డ్ అయిన బాలినేని
Advertisements