జ‌గ‌న్ మీ బిడ్డ‌ని ఆశీర్వ‌దించ‌మంటున్నాడ‌ని, ఆయ‌న బిడ్డ కాదు రాష్ట్రం పాలిట క్యాన్స‌ర్ గ‌డ్డ అని చంద్ర‌బాబు సెటైర్లు పేల్చారు. జ‌గ‌న్ అనే క్యాన్స‌ర్ గ‌డ్డ జ‌నానికే కాదు, రాష్ట్ర భ‌విష్య‌త్తుకే ప్ర‌మాద‌క‌రం అంటూ చెప్పుకొచ్చారు. తాను సీఎంగా ఉన్న‌ప్పుడు చేసిన భోగాపురం ఎయిర్‌పోర్ట్, అదానీ డేటా సెంట‌ర్ల‌కి మ‌ళ్లీ జ‌గ‌న్ సీఎం అయ్యాక శంకుస్థాప‌న‌లు చేయ‌డంపై చంద్ర‌బాబు చాలా వ్యంగ్యంగా స్పందించారు. ప్రజావేదిక కూల్చివేత విద్వంసంతో జగన్ రాష్ట్రంలో  రివర్స్ పాలనకు తెరతీశార‌ని,  ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నార‌ని వివ‌రించారు. మేము తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్, రూ. 67,000 కోట్లు,  స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ప్రాజెక్టు అమరావతి రూ. 50,000 కోట్లు,  ప్రకాశం జిల్లాలో కాగిత పరిశ్రమ రూ. 28,000 కోట్లు, రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ తిరుపతి రూ. 15,000 కోట్లు, అమర్ రాజా లిథియం అయాన్ బ్యాటరిస్ ,చిత్తూరు రూ. 9,500 కోట్లు, లూలూ గ్రూపు విశాఖ రూ. 2,200 కోట్లు, టైట్రాన్ బ్యాటరీస్, చిత్తూరు రూ. 727 కోట్లు, ప్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖ రూ. 450 కోట్లు, జాకీ అనంతపురం రూ. 290 కోట్లు పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకుంటే జగన్ రెడ్డి వాటిని కమీషన్ల కోసం వాటిని పొరుగు రాష్ట్రాలకు తరిమేశార‌ని ఆరోపించారు. కియా కార్స్ టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసి మొదటి కారును కూడా మేము విడుదల చేస్తే,  జగన్ రెడ్డి అదే కియాని మరోసారి ప్రారంభించార‌ని ఎద్దేవ చేశారు. ఏటీసీ టైర్స్, అపోలో టైర్స్, ఏసియన్ పెయింట్స్, కర్నూలు ఓర్వకల్ ఎయిర్ పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఇవన్నీ నాడు  మేం శంకుస్ధాపన చేస్తే  జగన్ రెడ్డి సిగ్గులేకుండా మళ్లీ శంకుస్దాపన చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.  భోగాపురం ఎయిర్ పోర్టు  భూసేకరణ పూర్తి చేసి 2019లో శంకుస్ధాపన చేశామ‌ని, ప్రతిపక్షనేతగా నాడు జగన్  బోగాపురం ఎయిర్ పోర్ట్ కి రైతులు భూములివ్వొద్దని,  ఇచ్చిన భూములు మేం అధికారంలోకి వస్తే వెనక్కి ఇస్తామని చెప్పి  కోర్టుల్లో కేసులు వేసి ఎయిర్ పోర్ట్ నిర్మాణం ముందుకు సాగ‌కుండా అడ్డుప‌డ్డార‌ని  తేదీలు, సాక్ష్యాల‌తో బాబు ప్రెజెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. అదే జగన్ రెడ్డి నేడు భోగాపురం ఎయిర్ పోర్టుకి మళ్లీ శంకుస్దాపన పేరుతో డ్రామాలాడుతున్నార‌ని వివ‌రించారు. త‌న శైలికి భిన్నంగా చాలా వివ‌రాల‌తోనూ, చాలా వ్యంగ్యంగానూ చంద్ర‌బాబు వైసీపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read