యథా రాజా తథా అధికారి అన్న మాదిరిగా ఉంది ఏపీలో పాలన. రాజ్యాంగసంస్థలు, కోర్టులు అంటే ప్రభుత్వం ప్రదర్శిస్తున్న లెక్కలేనితనాన్ని బ్యూరోక్రాట్లూ ప్రదర్శిస్తున్నారు. ఈ నిర్లక్ష్య ఫలితం తరచూ కోర్టులలో దోషులుగా అధికారులను నిలబెడుతోంది. దేశంలోనే అతి ఎక్కువ కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ టాప్ అని ఇటీవల గణాంకాలు వెల్లడించాయి. తాజాగా మరో కోర్టు ధిక్కరణ కేసులో ఏకంగా ఐదుగురు ఉన్నతాధికారులు జైలుశిక్ష పడింది. ఆర్టీసీ ఫీల్డ్మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని ఫీల్డ్మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిగింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐదుగురు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు చెబుతూ ఈ నెల 2వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు నెల రోజులు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు నెల రోజులు, మరో ముగ్గురు అధికారులకు కూడా నెల రోజుల జైలు శిక్ష చొప్పున విధించారు. ఐదుగురు అధికారులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు. ఈ నెల 16లోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.
ఐదుగురు ఐఏఎస్, ఐపీఎస్ లకి జైలు శిక్ష.. హైకోర్ట్ సంచలన తీర్పు...
Advertisements