వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చాలా భిన్నం. తనపై దా-డి జరిగిందని కేసు పెట్టాడు. ఆ కేసులో విచారణకి కోర్టు పిలిస్తే ట్రాఫిక్ సమస్య అంటాడు. పాలనలో బిజీగా ఉన్నానని చెబుతాడు. ఈయన చేస్తున్న పాలన అందరికీ తెలుసు. చావులకి , పెళ్లిళ్లకు వెళ్లడం తప్పించి ఆయన చేసిన పాలన ఏమీ లేదని ప్రజలకి తెలుసు. కోర్టులకి పత్రాలే ఆధారం కాబట్టి ఆ మేరకు పత్రాలు సమర్పించి తప్పించుకుంటున్నాడు. నిందితుడిగా ఉన్న కేసుల్లోనూ కోర్టుకి రాడు. బాధితుడిగా ఉన్న కేసుల్లోనూ కోర్టుకి వెళ్లడు. చిన్నపిల్లలు బడికి వెళ్లనని మారాం చేస్తే బడిదొంగ అని గేలి చేసేవారు. జగన్ కోర్టు విచారణకి పిలిస్తే, వెళ్లకుండా రకరకాల సాకులతో ఎగ్గొడుతుంటే కోర్టు దొంగ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నాలుగేళ్ల తరువాత విశాఖపట్నం విమానాశ్రయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దా-డి కేసుపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ ఆరంభమైంది. ఈ కేసులో సాక్షి, బాధితుడిగా ఉన్న సీఎం జగన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలని గత వాయిదాకి జడ్జి ఆదేశాలిచ్చారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బదులు ఆయన పీఏ కె నాగేశ్వర్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రానికి సీఎంగా బాధ్యతల నిర్వహణ ఉందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాల సమీక్షలు ఉన్నాయని, తాను కోర్టుకు హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటగూట జగన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సాక్ష్యం నమోదుకి అవకాశం కల్పించాలని జగన్ రెడ్డి వేసిన పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి విచారణ షెడ్యూల్‍ను రద్దు చేసి ఈనెల 13కు వాయిదా వేశారు.
కోడికత్తితో పొడిచాడంటాడు..కోర్టుకెళ్లడు..ఇదేమి జగన్ నాటకం
Advertisements