ఇటీవలే టిడిపి యువనేత లోకేష్ జగన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ వేశారు. ``జగన్ పని అయిపోయింది. లండన్ వెళ్లేందుకు లగేజీ సర్దుకో`` అని దాని సారాంశం. ఈ లండన్ కథేంటి? అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే జగన్ కి లండన్‌కి ఏదో సంబంధం ఉండే ఉంటుందని చాలా మంది అనుమానిస్తున్నారు. నాలుగు ఎమ్మెల్సీలు ఓడిపోయి వైసీపీ తొలిసారిగా డిఫెన్స్‌లో పడిన కీలక సమయంలో హఠాత్తుగా జగన్ రెడ్డి లండన్ పయనం అవుతుండడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. గడప గడపకీ మన ప్రభుత్వం, జగన్ మా భవిష్యత్తు కార్యక్రమాలు ఊపిరి సలపకుండా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. చుట్టూ ఇంత ఒత్తిడితో కూడిన సమస్యలుంటే హఠాత్తుగా సీఎం లండన్ బయలుదేరుతారని వార్తలు వచ్చాయి. వైఎస్ జగన్ విదేశీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదని ప్రకటన విడుదల చేశారు. భార్య వైఎస్ భారతి, కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డితో కలిసి ఈ నెల 21వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లి వారం రోజులు అక్కడే ఉంటారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన వెళ్లింది ఎక్కువసార్లు లండనే. తన కుమార్తె అక్కడ ఉన్నా, ప్రతీసారీ లండన్ వెళ్లడం వెనుక ఏదో పెద్ద మతలబే ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అధికారంలో ఉన్నప్పుడు తాను వ్యవహరిస్తున్న నియంతృత్వ వైఖరికి పదవిపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అందుకే విదేశాలలో సెటిలయ్యేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారని టిడిపి నేతలు సైటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ వేసిన లండన్ ట్వీటు, ఇప్పుడు జగన్ లండన్ టూరు మ్యాచ్ అవుతున్నాయి.
ఉన్నట్టు ఉండి, జగన్ లండన్ టూర్ ఎందుకు ? దీని వెనుక కధ ఏంటి ?
Advertisements