తెలంగాణ ప్ర‌భుత్వం అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ఏపీలో వైసీపీ స‌ర్కారుని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తోంది. వాస్త‌వానికి వైసీపీతో టీఆర్ఎస్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే త‌మ‌ని తాము ప్ర‌మోట్ చేసుకునే క్ర‌మంలో ఏపీని చిన్న‌చూపు చూసినా వైసీపీ పాల‌కులు ఏమీ అన‌లేర‌నే ధీమాతోనే త‌ర‌చూ కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావు కూడా ఏపీలో ప‌రిస్థితుల‌పై ధ్వ‌జ‌మెత్తుతూనే ఉంటారు. తెలంగాణ పాల‌కులు త‌మ‌కి బోర్డ‌ర్‌లో ఉన్న క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర జోలికి మాత్రం వెళ్ల‌రు. ఈ రాష్ట్రాల వారి జోలికెలితే వారు ఒక రేంజులో కౌంట‌రిస్తారు. ఏపీలో అయితే తిట్టినా, కొట్టినా ప‌డి ఉంటార‌నే ధీమాతోనే తెలంగాణ పాల‌కులు త‌మ‌ని తాము గొప్ప‌గా చూపించుకునేందుకు ఏపీని అన్ని విష‌యాల్లో త‌క్కువ చేసి చూపుతుంటారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు, ట్ర‌బుల్ షూట‌ర్ అయిన తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వంపై అసక్తి కరమైన కామెంట్స్ చేసారు. ఆంధ్ర ,తెలంగాణలో పాలన చూస్తున్నారు క‌దా, ఏ రాష్ట్రంలో పాల‌న‌ బాగుందో మీరే ఆలోచించుకోండి అంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో  రహదారులు ఎలా ఉన్నాయో ,అభివృద్ధి ఎలా ఉందో చూడండి...అంటూ ఏపీలో రోడ్ల ద‌య‌నీయ‌స్థితిని ఎత్తి చూపారు. కార్మికులు ఆంధ్రలో ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో ఓటు హక్కు పొందితే..మీ బ‌తుకులు బాగుంటాయంటూ హ‌రీష్ రావు చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనిపై ఏపీ నుంచి ఏ ఒక్క మంత్రీ స్పందించ‌క‌పోవ‌డం విచిత్రం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read