దివంగత ముఖ్యమంత్రి సోదరుడు, ఇప్పటి ముఖ్యమంత్రికి స్వయానా బాబాయి అయిన వివేకానందరెడ్డి హ-త్యో-దం-తం వెనకున్న అసలు వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ అధికారులు తక్షణమే విజయసాయిరెడ్డిని విచారించాలని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్రప్రాంత పార్టీ ఇన్ ఛార్జ్ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! వివేకానంద రెడ్డి చ-ని-పో-యిం-ది గుం-డె-పో-టు-తో-నా ... గొ-డ్డ-లి పో-టు-తో-నా అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మాజీమంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడైన వ్యక్తి మ-ర-ణం వెనకున్న మిస్టరీ ఏమిటి? ఆయనది సహజ మ-ర-ణ-మా...లేక హ-త్యా అనేది తేలాలంటే, సీబీఐ వారు విజయసాయి రెడ్డిపై కన్నేయాలి. వాస్తవాలు బయటకు రావాలంటే, ఉత్తరాంధ్ర బం-ది-పో-టు విజయసాయి రెడ్డిని సీబీఐ విచారించాలి. వివేకానంద రెడ్డి చ-ని-పో-యి-న వెంటనే, ఆఘమేఘాలపై ఘటనాస్థలికి వెళ్లి, ఆయన గుం-డె-పో-టు-తో మ-ర-ణిం-చా-ర-ని చెప్పింది విజయ సాయి రెడ్డే. అసలు విషయం బయటకు రాకముందే... ఆయన ఎందుకు అలా చెప్పాడు? ఈ సందేహాలన్నింటికీ సమాధానం రావాలంటే, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని రెండేళ్లుగా పట్టి పీడిస్తున్న వ్యక్తిని సీబీఐ తక్షణమే విచారణకు పిలవాలి. వివేకానందరెడ్డి మృ-త-దే-హం-పై ఉన్న గొ-డ్డ-లి-పో-ట్ల-ని, లోతైన గాయాలను చూస్తే పాలుతాగే పిల్లాడు కూడా జరిగింది హ-త్యే-న-ని స్పష్టంగా చెప్పగలడు. కానీ వివేకానందరెడ్డి మ-ర-ణిం-చి-న-ప్పు-డు, పొంతన లేకుండా విజయసాయి అలాఎందుకు చెప్పాడో సీబీఐ తేల్చాలి. తొలుత గుం-డె-పో-ట-ని, తరువాత హ-త్య-ని, ఆ తరువాత చంద్రబాబే వివేకానందరెడ్డిని చం-పిం-చా-డ-ని ఏ2 పొంతన లేకుండా ఎందుకు మాట్లాడో తేల్చాలి. సీబీఐ పులివెందులలో విచారణకు వచ్చినప్పుడల్లా, విజయసాయి ఏవో కుంటిసాకులు చెబుతూ, ఎంపీనంటూ ఢిల్లీ పారిపోతున్నాడు.
వివేకానందరెడ్డి హ-త్య-కే-సు విషయాలు విజయసాయికి తెలుసునని ఆయన వైఖరి చూస్తుంటే తమకు, ప్రజలకు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు విజయసాయిరెడ్డిని కూర్చోబెట్టి, కుంగదీస్తే అసలు వాస్తవాలు తేటతెల్లమవుతాయి. సీబీఐ బృందం పులివెందులకు వచ్చిందంటేనే విజయసాయి పల్స్ రేటు పడిపోతుంది... ఎప్పుడు తనను పిలుస్తారా అని ఆయనకు చెమటలు పడుతుంటాయి. అవసరమైతే ఈ వ్యవహారంపై సీబీఐకి లేఖ కూడా రాయడానికి సిధ్ధంగా ఉన్నాము. ఉత్తరాంధ్రప్రజల అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని, ఏ2 తన దందాలు సాగిస్తున్నాడు. విజయసాయి దోపిడీపై ఉత్తరాంధ్ర వాసులు ఎందుకు తిరగబడటం లేదు? విజయసాయి పనులకు ప్రభుత్వ అండదండలుండ బట్టే, ఉత్తరాంధ్రకు సీఎంగా వ్యవహరిస్తూ, ఆ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను, భూములను ఇష్టానుసారం దోచుకుంటున్నాడు. ఆయన్ని అడిగేవాడు ... ఆపేవాడు లేడన్నట్లుగా ఏ2 పేట్రేగిపోతున్నాడు. ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారనే వాస్తవాన్ని విజయసాయి ఎంతత్వరగా గ్రహిస్తే అంత మంచిది.