జగన్మోహన్ రెడ్డి సర్కారు తప్పుడు పనులు చేయడంలో రికార్డులు సృష్టిస్తోందని, ఆర్థిక నేరాల్లో గొప్పపేరు ప్రఖ్యాతులు పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలంతా నోళ్లువెల్లబెట్టేలా మితిమీరి ప్రవర్తిస్తున్నాడని, గతంలో అడ్రస్ లేని కంపెనీలతో లక్షల కోట్లు పోగేసిన వ్యక్తి, ఇప్పుడు ముఖ్యమంత్రయ్యాక అడ్రస్ లేని జీవోలిస్తూ, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...! కొన్నిరోజులుగా ప్రభుత్వమిస్తున్న బ్లాంక్ జీవోలపై (ఖాళీ జీవోలు) పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. సాధారణంగా జీవోలు ఇచ్చేటప్పుడు, ఏ అంశం కోసం విడుదల చేస్తున్నారనేది స్పష్టంగా తెలిసేది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తాను చేస్తున్న తప్పుడు పనులు ప్రపంచానికి తెలియకూడదనే ఈ విధంగా బ్లాంక్ జీవోలు ఇస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జీవో అనే పదానికి అర్థమే మార్చేశాడు. గవర్నమెంట్ ఆర్డర్ గా చెప్పుకునే జీవోని గోల్ మాల్ ఆర్డర్ గా చేశాడు. తాను చేసే గోల్ మాల్ వ్యవహారాలకు అనుకూలంగా తప్పుడు జీవోలిస్తూ, అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. ఏ అవసరం వచ్చిందని, ఎలాంటి తప్పుడు పనులు చేయడానికి ముఖ్యమంత్రి ఇలాంటి గోల్ మాల్ ఆర్డర్లు ఇస్తు న్నాడో ఆయనే సమాధానం చెప్పాలి. గతంలో కూడా కాన్ఫిడెన్షియల్ జీవోల పేరుతో అసలు విషయాలను దాచి, జగన్ ప్రభుత్వం కొన్ని వందల జీవోలిచ్చింది. పత్రికల్లో వచ్చిన కథనాలను గమనిస్తే, పది నిమిషాల్లో పది రహస్య జీవోలని, కాన్ఫిడెన్షియల్ జీవోల జారీలో జగన్ ప్రభుత్వం రికార్డు అని, అర్థరాత్రి విడుదల అని వివిధ పేర్లతో కథనాలు వచ్చాయి. దొంగలు మాత్రమే అర్థరాత్రి పూట పనులు చక్కబెడుతుంటారు. ప్రజలు 151సీట్లిచ్చినా, ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి బుద్దిమాత్రం మారలేదనడానికి అర్థరాత్రి ఇస్తున్న బ్లాంక్ జీవోలే నిదర్శనం. గృహనిర్మాణశాఖలో 17 రహస్య జీవోలు ఇవ్వడంపై “గోప్యతతో గందరగోళము” అని కథనాలు వచ్చాయి. అలానే పంచాయతీరాజ్ శాఖలో కాన్ఫిడెన్షియల్ జీవోలు... పురపాలికశాఖలో అంతా గుంభనమే... అనేపేర్లతో కూడా కథనాలు వచ్చాయి. ఎటువంటి వివరాలు, లబ్ధిదారుల జాబితాలు తెలుపకుండా చెల్లించిన రూ. 41 వేల కోట్లకు సంబందించి కాగ్ సీఏజీ (కాగ్) తప్పుపట్టింది. ఇప్పడు కూడా అలాగే ఎలాంటి వివరాలు లేకుండా అడ్డగోలుగా జీవోలిస్తున్నారు. రహస్యజీవోలు, బ్లాంక్ జీవోలతో ముఖ్యమంత్రి తనదోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు.

ఎటు వంటి సమాచారం బయటకు రానివ్వకుండా ఇలాంటి జీవోలివ్వడం చూస్తేనే, ముఖ్యమంత్రి దుర్బుద్ధిఏమిటో తెలిసిపోతోంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రే ప్రజలకు వివరణఇవ్వాలి. అధికారుల బదిలీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకం త గోప్యత పాటిస్తున్నాడు? ముఖ్యమంత్రేమీ అధికారులను నియమించడం లేదు కదా..? జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, ఆయన చేస్తున్న తప్పుడు పనులకు సహకరిస్తూ, వారి గొయ్యి వారే తీసుకుంటున్నారు. గతంలో ఎలాగైతే, ఐఏఎస్ అధికారులు ఈ అవినీతిపరుడిని నమ్మి, ఇప్పటికీ కోర్టులచుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారిని చూశాకైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారులు బాధ్యతతో, చట్టప్రకారం పనిచేస్తే మంచిదని సూచిస్తున్నాం. కాన్ఫిడెన్షియల్ జీవోలు, బ్లాంక్ జీవోలు విడుదల చేసే అధికారులంతా తాడేపల్లి ఆదేశాల ప్రకారం నడుచుకోవడం మానుకుంటే, వారికే మంచిదని చెబుతున్నాం. తప్పుడు పనుల్లో భాగస్వాములు కావద్దని ప్రభుత్వంలోని ఉన్న తాధికారులను కోరుతున్నాం. ఏ దొంగపనులు, తప్పుడు పనులు చేయడం కోసం ముఖ్యమంత్రి అధికారులతో అర్థరాత్రి జీవోలు ఇప్పిస్తున్నాడు? వేలకోట్ల అవినీతిని కొనసాగించడానికే ముఖ్యమంత్రి ఈవిధంగా జీవోలిప్పిస్తున్నాడా? ఏ దురుద్దేశంతో ముఖ్యమంత్రి వివిధ శాఖల్లో తప్పుడు జీవోలిప్పిస్తున్నాడు? ప్రజలంతా కూడా ఈ దొంగముఖ్యమంత్రి వ్యవహార శైలిని అర్థంచేసుకోవాలని కోరుతున్నాం. గవర్నమెంట్ ఆర్డర్ ను గోల్ మాల్ ఆర్డర్ గా మార్చేసి మరీ, ఈ ముఖ్యమంత్రి బ్లాంక్ జీవోలు, కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇప్పిస్తున్నాడు. సదరు జీవోల వెనకున్న రహస్యాలను ప్రభుత్వం తక్షణమే ప్రజల ముందుంచాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ఏ అంశాల కోసం ప్రభుత్వం బ్లాంక్ , రహస్య జీవోలు విడుదల చేస్తోంది. ఎటువంటి అవినీతి కార్యక్రమాలకోసం రాత్రికి రాత్రి అధికారులను మార్చేస్తూ, బ్లాంక్ జీవోలు ఇస్తున్నారు? ఎవరికి ఎంత దోచిపెట్టడంకోసం ప్రభుత్వం బ్లాంక్ జీవోలు ఇస్తోంది? ఏ కంపెనీకి ఏరకంగా సహక రించడానికి కాన్ఫిడెన్షియల్ జీవోలిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో బ్లాంక్ జీవోల జారీ ముసుగులో జరుగుతున్న అవినీతిని జాతీయ మీడియా కూడా ప్రశ్నిస్తోంది. అధికారులిచ్చే జీవోలపై ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వడంలేదు? ప్రతిదానికీ పోలోమని ఎగేసుకొని మీడియా ముందుకొచ్చే తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి రహస్య, బ్లాంక్ జీవోల జారీపై సమాధానంచెప్పడానికి మీడియా ముందుకు ఎందుకురాలేదో చెప్పాలి. ఏపీప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చీకటివ్యవహారాలు, రహస్యజీవోల బాగోతంపై ఆలోచనచేయాలని పట్టాభిరాం అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read