జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటీషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. గత విచారణలో, సిబిఐతో పాటుగా, విజయసాయి రెడ్డిని కూడా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు కోరింది. ఈ నేపధ్యంలో ఈ రోజు ఏమి కౌంటర్ దాఖలు చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో సిబిఐ కోర్టులో ఈ రోజు సిబిఐ అధికారులు ఏమి కౌంటర్ ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో, సిబిఐ అధికారులు ఈ రోజు కూడా కౌంటర్ దాఖలు చేయకుండా, ఒక మెమో దాఖలు చేసారు. ఆ మెమో కూడా ఏక వాఖ్య తీర్మానంలాగా, కోర్ట్ విచక్షణ మేరకు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకే అంటూ, ఆ మెమోలో తెలిపారు. అయితే తమ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా, పిటీషన్ లో సిబిఐ పై కూడా అనేక ఆరోపణలు ఉన్నా కూడా సిబిఐ వాటికి ఏమి సమాధానం చెప్పకుండా, కేవలం ఒక సింగల్ లైన్ లో మెమో దాఖలు చేయటం పై, విమర్శలు వస్తున్నాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి కేసు విషయంలో, ఏ విధంగా అయితే సిబిఐ వ్యవహరించిందో ఇప్పుడు కూడా సిబిఐ అలాగే వ్యవహరించింది. ఎక్కడా కూడా సిబిఐ అధికారులు అవును రద్దు చేయాలి అని కానీ, రద్దు చేయవద్దు అని కానీ చెప్పకుండా, తమ వైఖరి చెప్పటం పై విమర్శలు వస్తున్నాయి.
అయతే గత విచారణ సందర్భంగా తమకు కౌంటర్ దాఖలు చేయటానికి గడవు కావలి అంటూ సిబిఐ కోరటం, అయితే ఇప్పుడు వారం తరువాత, సింగల్ లైన్ లో విచక్షణకే వదిలేస్తున్నాం అని చెప్పటం పై, విమర్శలు వస్తున్నాయి. ఈ ముక్క వారం క్రితమే చెప్పవచ్చు కదా అనే విమర్శలు వస్తున్నాయి. కేవలం టైం తీసుకుని కేసుని సాగతీయటానికి ఇలా చేస్తున్నారా అని పలువురు సిబిఐ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే అంశం పై రఘురామ తరుపు న్యాయవాది మాట్లాడుతూ, సిబిఐ వైఖరి ఇలా ఎందుకు ఉందో అర్ధం కావటం లేదని అంటున్నారు, ఏదోక స్టాండ్ తీసుకోవాలి కానీ, ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని అన్నారు. గతంలో జగన్ పేరు, ఇప్పుడు విజయసాయి పేరుగా మర్చి, అదే మెమో ఇచ్చారని అంటున్నారు. ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అని చెప్పి, ఇలా వైఖరి చెప్పకపోవటం పై ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. అయితే విజయసాయి రెడ్డి ఈ రోజు కౌంటర్ దాఖలు చేయకపోవటంతో, ఇక్కడ మాత్రం కోర్టు ఎక్కువ సమయం ఇవ్వలేదు, సోమవారానికి వాయిదా వేస్తూ, ఆ రోజు కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. మరి ఆ రోజు ఏమి చేస్తారో చూడాలి.