నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రాజద్రోహానికి పాల్పడుతున్నారు అంటూ, ఆయన పై రాజద్రోహం కేసు పెట్టి, హైదరాబాద్ లోని ఆయన ఇంటి నుంచి, ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి, మంగళగిరి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు రాత్రి రఘురామకృష్ణం రాజు పై, సిబిఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ ఆరోపణలు వచ్చాయి. దీని పై రఘురామరాజు ఈ కేసు, బెయిల్ పిటీషన్ సందర్భంగా, తనకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తారు. సుప్రీం కోర్టులో సిబిఐ విచారణ కావాలి అంటూ పిటీషన్ వేసారు. దీని పై అప్పట్లోనే ప్రాధమికంగా విచారణ చేసిన ధర్మసానం, జూన్ నెలకు వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే, ఈ పిటీషన్ జూన్ నెలకు కూడా కోర్టు ముందుకు రాలేదు. ఇప్పుడు ఆగష్టు మూడో వారం వస్తున్నా, ఈ కేసు పై ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో ఈ కేసు విషయమై రఘురామరాజు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. తన కస్టోడియల్ టార్చర్‍పై వేసిన పిటీషన్ ఇంకా విచారణకు రాలేదని, ఈ పిటీషన్ ని విచారణకు తీసుకోవాలని, త్వరగా విచారణ చేయాలి అంటూ, సుప్రీం కోర్టుని రఘురామరాజు కోరారు. ఆ పిటీషన్ లో తనకు జరిగిన అన్యాయం పై సిబిఐ విచారణ కోరినట్టు చెప్పారు. ఈ పిటీషన్ గత నెలలోనే విచారణకు రావలసి ఉందని అన్నారు.

rrr 12082021 2

పలు మార్లు విచారణ జాబితాలోకి వచ్చినా, పలు కారణాలతో, ఈ పిటీషన్ బెంచ్ మీదకు రాలేదని, జాబితాలో ఉన్నా కూడా విచారణ జరగలేదని రఘురామరాజు కోర్టుకు తెలిపారు. రఘురామరాజు విజ్ఞప్తి పై సుప్రీం కోర్టు స్పందించింది. జస్టిస్ వినీత్ శరణ్ స్పందిస్తూ, మీ విజ్ఞప్తిని పరిశీలించమని, సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి తగు ఆదేశాలు ఇస్తామని, త్వరలోనే ఈ పిటీషన్ పై విచారణ చేస్తామాని తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు నుంచి రిజిస్ట్రీకి, రఘురామరాజు విజ్ఞప్తి పై ఆదేశాలు వెళ్ళాయి. ముఖ్యంగా సిఐడి కస్టడీలో ఉండగా, రఘురామరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేది ఆరోపణ. అయితే దీని పై హైకోర్టు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులను రిపోర్ట్ ఇవ్వమని కోరగా, వారు ఏమి లేదని రిపోర్ట్ ఇచ్చారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రకారం, సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ హాస్పిటల్ లో పరీక్షలు చేయగా, ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయినట్టు ఆర్మీ హాస్పిటల్ వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం తేల్చాలని, బాద్యుల పై చర్యలు తీసుకోవాలని రఘురామరాజు కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read