జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ ని ఈ రోజు సిబిఐ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే, సిబిఐ కోర్టు ఈ తీర్పు ఇవ్వటానికి, ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంది అనే అంశం పై, న్యాయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. రఘరామరాజు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టేయటం వెనుక, సిబిఐ వైఖరే కారణం అని, సిబిఐ వైఖరితోనే, ఈ బిగ్ రిలీఫ్ వచ్చినట్టు న్యాయవాదుల్లో చర్చ జరుగుతుంది. రఘురామకృష్ణం రాజు థర్డ్ పార్టీ. జగన్ మోహన్ రెడ్డి పై కేసులు వేసింది సిబిఐ. దాదాపుగా 11 చార్జ్ షీట్లు వేసారు. గతంలో కూడా సిబిఐ అనేక సార్లు జగన్ కు వ్యతిరేకంగా అనేక పిటీషన్లు వేసింది. అయితే ఈ సారి రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ లో మాత్రం, వింత వైఖరి అవలంభించింది. రఘురామకృష్ణం రాజు వాదనలు వినిపిస్తూ, జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు కండీషన్లు ఎలా ఉల్లంఘిస్తుంది కోర్టు ముందు వాదనలు వినిపించారు. తమ అధికారాన్ని ఉపయోగించి, సహా నిందితులకు ఎలా పోస్టింగ్ లు ఇస్తుంది, ఎలా ప్రభావితం చేస్తుంది, మొత్తం తమ వాదనల్లో కోర్టు ముందు ఉంచారు. అయితే తాము ఎవరి మీద అయితే 11 చార్జ్ షీట్లు వేసారో, అదే సిబిఐ మాత్రం, ఇక్కడ వింత వైఖరి అవలంభిస్తూ.
ఒకసారి న్యాయవాదులకు జ్వరం వచ్చిందని, ఒకసారి కౌంటర్ వేస్తామని సమయం తీసుకోవటం, ఒకసారి కోర్టు ఇష్టం అంటూ ఒకే లైన్ లో చెప్పటం ఇవన్నీ జగన్ మోహన్ రెడ్డి లాయర్లుకు కలిసి వచ్చాయి. రఘురామరాజుకి ఈ కేసుతో ఏమి సంబంధం అంటూ జగన్ తరుపు న్యాయవాదులు వాదించారు. రఘురామరాజు థర్డ్ పార్టీ అని, అతనికి, ఈ కేసుతో సంబంధం లేదని, ఆయనది రాజకీయ కక్ష అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఇక్కడ జగన్ లాయర్లు చెప్పిన మరో కీలక పాయింట్, అసలు స్పందించాల్సిన విచారణ సంస్థ సిబిఐ, జగన్ బెయిల్ కండీషన్లు ఉల్లంఘించారని ఎక్కడా చెప్పలేదని, సిబిఐకి లేని అభ్యంతరం, రఘురామరాజుకి ఎందుకు అంటూ కోర్టు ముందు వదనలు వినిపించారు. దీంతో కోర్టు కూడా జగన్ తరుపు న్యాయవాదుల వాదనతో ఏకీభావిచిందనే చెప్పాలి. సిబిఐ ఎక్కడా అభ్యంతరం చెప్పక పోవటంతో, విచారణ సంస్థకే ఏమి ఇబ్బంది లేనప్పుడు, ఈ పిటీషన్ ఎందుకు అనే జగన్ తరుపు న్యాయవాదుల వాదనను కోర్టు కూడా ఏకీభవించి, పిటీషన్ రద్దు చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద సిబిఐ తీసుకున్న తటస్థ వైఖరి జగన్ కు కలిసి వచ్చింది.