పెగసస్ స్పైవేర్ అంశంపై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు ఎస్జీ తెలిపారు. పెగసస్‌పై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ పిటిషన్లు దాఖాలు అయ్యాయి. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదని కేంద్రం తమ అభిప్రాయంగా సుప్రీం కోర్టుకు తెలిపింది. పెగసస్ అంశం అత్యంత ముఖ్యమైనదేనన్న సోలిసిటర్ జనరల్, స్వతంత్ర కమిటీ అన్నీ పరిశీలించి నివేదిస్తుందని సుప్రీం కోర్టుకు తెలిపింది. దేశభద్రత, శాంతిభద్రతల అంశాల్లోకి వెళ్లడం లేదన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రామన్, డిపెన్స్ తదితర విషయాలు అడగట్లేదని మేము అడిగినవి చెప్తే చాలని అన్నారు. కేంద్రం పదేపదే అవే అంశాలను ప్రస్తావిస్తుందని చీఫ్ జస్టిస్ అన్నారు. పెగసస్ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం గుర్తుంచుకోవలనింనారు. పౌరహక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని, కేంద్రాన్ని ఆదేశించారు. గోప్యతా హక్కుల ఉల్లంఘన ఆరోపణలకే పరిమితం కావాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక ప్రకటన చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం అని, కారణం ఏమైనా.. ప్రకటన చేయడానికి కేంద్రం ఇష్టపడట్లేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలో ఆలోచించి జారీ చేస్తామన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
రెండు మూడు రోజుల్లోనే ఈ అంశం పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. అన్ని ఆరోపణలను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్న కేంద్రం తరుపున సోలిసిటర్ జనరల్ తెలిపారు. అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు అని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివరంగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదన్న ఎస్జీ కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు కూడా తాము రెండు మూడు రోజుల్లోనే దీని పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని అన్నారు. మరో పక్క పిటీషనర్ తరుపున న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, వాస్తవాలు చెప్పబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ప్రకటన చేయడం భద్రతకు సంబంధించిన విషయం కాదు అని అన్నారు. సాధారణ ప్రజలే లక్ష్యంగా చట్టవిరుద్దంగా పెగసెస్ వాడారని తెలిపారు. దేశ పౌరులపై పెగసెస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని, స్పైవేర్ ఉపయోగించడం పూర్తిగా చట్టవిరుద్దమైందని, మేం చేయాల్సింది చేస్తామన్న విధంగా కేంద్రం తీరు ఉందని అన్నారు. 120 మంది భారతీయుల ఫోన్లు పెగసస్ ప్రభావానికి గురైనట్లు నివేదికలు ఉన్నాయని, నివేదికలను పరిశీలించినట్లు స్వయంగా కేంద్రమంత్రే ప్రకటించారని సిబల్ తెలిపారు.