వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.ఎస్ రాజు పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ప్రతిపక్షాన్ని చూస్తే వైసీపీ నాయకులకు గుండెల్లో దడ పుడుతోందన్నారు.  ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  లేని దిశా చట్టాన్ని ఉన్నట్లుగా ప్రచారం చేసుకోవడం పట్ల తిరుపతిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తుంటే చినబాబు పట్ల పోలీసులు ఓ రౌడీషీటర్‌లా వ్యవహరించడం, ఒక వీధి రౌడీని లాక్కెళ్ళినట్లుగా లాక్కెళ్లడం దుర్మార్గమన్నారు.  జగన్ అవినీతి, దుర్మార్గాన్ని వ్యతిరేకించినవారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. నాడు చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే  నేడు జగన్ సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు. వైసీపీకి 2 లక్షల మంది పోలీసుల మద్దతుంటే టీడీపీకి 70 లక్షల టీడీపీ సభ్యుల మద్దతుందని గర్వంగా చెప్పారు. జగన్‌కు పాదపూజ చేయాలనుకున్న పోలీసులు ఖాకీ చొక్కాను వదిలేయాలని సూచించారు. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గ్రహించాలన్నారు. జగన్ పుట్టినరోజునాడు వేలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి భజన చేసినప్పుడు ఈ క-రో-నా నిబంధనలేమయ్యాయని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో అచ్చెన్నాయుడు కుటుంబాన్ని ఓడించలేక అచ్చెన్నాయుడుపై అవాకులు చవాకులు పేల్చడం మానుకోవాలన్నారు. రౌడీలుగా వ్యవహరించే రాజకీయ నాయకులను పార్టీలో చేర్చుకొని పదవులివ్వడం సంస్కారం అనిపించుకోదని గుర్తు చేశారు.  దువ్వాడ శ్రీనివాస్ తన ధోరణి మార్చుకోవాలి. జగన్ పాదయాత్రలో కార్చింది మొసలి కన్నీరని ప్రజలు గ్రహించారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీకి ఊడిగం చేసే పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read