గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల, అలాగే జగన్ మోహన్ రెడ్డి మధ్య మాటలు లేవు అంటూ వార్తలు వచ్చాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు ఊతమిచ్చాయి. ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా, ఇదుపులులపయాలో, వైఎస్ సమాధి వద్దు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ, షర్మిల, జగన్ పక్క పక్కనే కూర్చున్నా, జగన్, అటు షర్మిలతో కానీ, ఇటు విజయమ్మతో కానీ మాట్లాడ లేదు. పక్కనే షర్మిల ఉన్న ఎడమొఖం పెడమోఖంగానే ఇద్దరూ ఉన్నారు. ఇతరులతో బాగానే మాట్లాడుకున్నా, ఇరువురు మాత్రం మాట్లాడుకోలేదు. అయితే ఈ రోజు వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇద్దరూ ఒకే చోట ఉన్నారు కాబట్టి, ఇద్దరూ కలిసి పోతారని అందరూ అనుకున్నా, బయటకు కలిసి కూర్చున్నా, ఎక్కాడా మాటలు అయితే లేవు. దీంతో వైఎస్ అభిమానులు నిరాశ చెందారు. అయితే ఇదే సందర్భంలో షర్మిల చేసిన ట్వీట్ చూస్తే ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగిందని అర్ధం అవుతుంది. నేను ఒంటరిని అంటూ షర్మిల ట్వీట్ చేసారు. రాజశేఖర్ రెడ్డి ఆశీసులు కావలని కోరారు. ఏడుపు ఆగటం లేదు అంటూ ట్వీట్ చేసారు. ఒంటరిని అంటూ షర్మిల ట్వీట్ చేయటంతో, ఆమెకు అన్నగా జగన్ నుంచి సహకారం లేదనే అర్ధం అవుతుంది.
గతంలో వైఎస్ పుట్టిన రోజు సందర్భంగా, ఇద్దరూ వేరు వేరుగా నివాళులు అర్పించారు. ఇప్పుడు కలిసి ఉన్నా, మాట్లాడుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ ఉందనే అర్ధం అవుతుంది. గతంలో కూడా సాక్షి తమకు కవరేజ్ ఇవ్వదు అంటూ షర్మిల బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే షర్మిలని పార్టీ పెట్టవద్దు అని కోరినట్టు సజ్జల కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ రోజు వైఎయస్ విజయమ్మ పాత నాయకులు అందరితో కలవ బోతున్నారు. షర్మిల రాజకీయ పార్టీకి అనుకూలంగా ఈ భేటీ ఉండ బోతుందని తెలుస్తుంది. అయితే కొంత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా పిలుపు వచ్చినా, అధిష్టానం ఎవరిని వెళ్ళవద్దు అని ఆదేశించినట్టు తెలుస్తుంది. అలాగే మరో ప్రచారం ప్రకారం, విజయమ్మ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఇన్నాళ్ళు తమ ప్రత్యర్ధి పార్టీల కుటుంబాల్లో ఉన్న గొడవలు పెద్దది చేసి చూపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తమ అధినేత కుటుంబలోనే ఇలా ఇబ్బందులు ఉండటంతో, డిఫెన్స్ లో పడ్డారు.