ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనం సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ లో వస్తున్న ఫేక్ న్యూస్ ల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ బాధ్యతగా ఉండటం లేదని, బాధ్యతారాహిత్యంగా ప్రవరిస్తున్నాయని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తల పై ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సంస్థలు సామాన్యులు లేవనెత్తుతున్న అభ్యంతరాలు పట్టించుకోవటం లేదని, చివరకు న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ పట్టించుకోవటం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేవలం శక్తివంతమైన వ్యస్థలు, వ్యక్తులు చెప్పిన మాటలనే పట్టించుకుంటున్నాయని, మిగతా వారని పట్టించుకోవటం లేదు అనే ఆవేదనను, ఆగ్రహాన్ని సుప్రీం కోర్టు వ్యక్తం చేసింది. ఈ రోజు జరిగిన ఒక కేసు వ్యవహారంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేసారు. క-రో-నా మొదటి వేవ్ స్ప్రెడ్ అవ్వటానికి, ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ సమావేశాలే కారణం అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన ప్రచారం పై, దానికి వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు అయ్యింది. ఆ పిటీషన్ పైనే ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగానే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేసారు. అదే సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ఇటీవల తీసుకుని వచ్చిన ఐటి నిబంధనల పై కూడా విచారణ జరిగింది.
కేంద్రం తీసుకుని వచ్చిన ఐటి నిబంధనల పై వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో దాఖలైన పిటీషన్లు అన్నీ కూడా సుప్రీం కోర్టుకు బదిలీ చేసి, ఇక్కడే విచారణ జరిపించాలి అని, ఇవి కేంద్రం తీసుకుని వచ్చిన నిబంధనలు కాబట్టి, వీటి పై వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో విచారణ జరగటం కన్నా, సుప్రీం కోర్టులో విచారణ జరిపితేనే బాగుటుంది అంటూ, కేంద్ర ప్రభుత్వం ఒక పిటీషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటీషన్ల పై జరిగిన విచారణ సందర్భంగా, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకుంటూ, సోషల్ మీడియాలో, వెబ్ పోర్టల్స్ లో చేస్తున్న ఫేక్ ప్రచారం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే న్యాయమూర్తుల పై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన వారి పై, చర్యలు తీసుకోక పోవటం పై కూడా చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయాలకు కూడా వర్తిస్తుంది అంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్ ను కొన్ని పైడ్ వర్గాల చేత, చేస్తున్న విష ప్రచారాన్ని గుర్తు చేస్తున్నారు.