డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు మీరొక ఐపీఎస్ ఆఫీసర్, వైసీపీ ప్రతినిధి కాదని గ్రహించాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆదివారం ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు మహిళల్ని, టీఎన్ఎస్ఎఫ్ సభ్యుల్ని, తెలుగు యువకుల్ని హౌస్ అరెస్టులు చేసి, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. ఆగస్టు 15వ తేదిన గుంటూరులో బీటెక్ చదువుతున్న రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద అతి కి-రా-త-కం-గా చం-ప-డం, నారా లోకేశ్ ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఆ రోజు నారా లోకేశ్ తో పాటు 33 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేశ్ విలేఖరులతో మాట్లాడుతూ రమ్యను చం-పి-న-వా-రి-ని 21 రోజుల్లో శిక్ష విధించాలని,. లేని పక్షంలో దిశ చట్టం గురించి మీరెటువంటి వివరణ ఇస్తారో ఇవ్వాలని అన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు. నిందితులకు శిక్ష పడాలి, రమ్యకు, రమ్య కుటుంబానికి న్యాయం జరగాలని శాంతీయుతంగా క్యాండిల్ ర్యాలీ చేసి దిశ పోలీసు స్టేషన్ కు రెప్రజంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఇబ్బందుల పాలు చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, డమ్మి హోం మినిష్టర్ సుచరిత, పోలీసుల వల్ల ఇబ్బందుల పాలయ్యాం. పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటనకు కదలిపోయి, అటువంటి సంఘటనలు ఏపీలో జరగకూడదని ఏపీ దిశ చట్టం విప్లవాత్మకం, మహిళలపై దా-డి చేయాలనే ఆలోచన రాగానే వెన్నులో వణుకు పుట్టాలనే ఉద్దేశంతో ఈ చట్టం తెస్తున్నాం అని డిసెంబర్ 13వ తేదిన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో నిందితులకు ఉ-రి శిక్ష వేస్తామని ఇచ్చిన ఊదరగొట్టే ఉపన్యాసాలిప్పుడేమయ్యాయి? దిశ చట్టం ద్వారా రాష్ట్రంలో ముగ్గురికి ఉ-రి శిక్ష విధించాము, 500 మందికి పైగా శిక్షలు విధించాము అని డమ్మీ హోం మినిష్టర్ తెలిపారు. రెండు నెలలు గడిచాక అంటే ఆగస్టు 24వ తేదిన దిశ చట్టం కాలేదు, దిశ చట్టం స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది అని సాక్షాత్తు హోం మినిష్టర్ చెప్పారు. ఒకే హోం మనిష్టరు రెండు రకాలుగా దిశ చట్టం గురించి మాట్లాడారు. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ దిశ అనేది చట్టం కాదు, ఇదొక కార్యక్రమం మాత్రమే.. కేంద్రం కొర్రీల వల్ల చట్టంగా మారేందుకు సమయం పడుతుందని డీజీపీ అనడంలో అర్థంలేదు. చేతకాని పరిపాలనతో ఆడవారి మాన ప్రాణాలకు ఖరీదు కడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులపై ఏమైనా విచారణ చేపట్టారా?

అని విలేఖరులు గౌతమ్ సవాంగ్ ను అడిగితే సమాధానం లేదు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, వైసీపీకి ప్రతినిధి కాదని గ్రహించాలి. సీఎం ఇంటినుంచి కూతవేటు దూరంలో ఉన్న సీతానగరం వద్ద గ్యాంగ్ రే-ప్ జరిగితే నిందితులకు శిక్షలు లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఫోర్త్ లైన్ యాప్ ని రంగులు, పేరు మార్చి దిశ యాప్ అని పేరు పెట్టి దివాళా కోరుతనానికి శ్రీకారం చుట్టారు. రే-ప్ లు, హ-త్య-లు, వంచనకు గురవుతున్న ఆడవారికి న్యాయం లభించడం లేదని నిక్కచ్చిగా చెప్పొచ్చు. దిశ చట్టాన్ని టీడీపీ అపహాస్యం చేయడంలేదు, వ్యంగంగా మాట్లాడటంలేదు. ప్రభుత్వ పరంగా మహిళలను రక్షించాల్సిన అవసరముంది. దాని గురించి మాట్లాడటం మానేసి మేం అపహాస్యం చేస్తున్నామని మాట్లాడమేంటి? దిశ చట్టమే కానప్పుడు దిశ పోలీసు స్టేషన్లను ఎందుకు ఏర్పాటు చేశారు?. ప్రజా ధనాన్ని అనవసరంగా ఖర్చు చేసి దిశ పోలీసు స్టేషన్లను, ఆ స్టేషన్లలో డిఎస్పీలను ఎందుకు బఫూన్లుగా తీర్చిదిద్దుతున్నారో చెప్పాలి. దిశ చట్టం స్ఫూర్తి అని మాట్లాడటంలో అర్థంలేదు. ఈ చట్టం అమలుకు సినారియా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. పాపులేషన్ ప్రకారం పది లక్షల మందికి యాభై మంది న్యాయమూర్తులుండాలి. యావరేజ్ న తీసుకుంటే రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందికి పదమూడు మంది న్యయమూర్తులు మాత్రమే ఉన్నారు. ఈలెక్క ప్రకారం రాష్ట్రంలో దిశ చట్టం అమలుకు ఆస్కారం లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించి 176 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. రెండున్నర సంవత్సరాలైనా భర్తీ చేయలేదు. ఫోరన్సిక్ ల్యాబ్ లు ఎక్కువగా లేకపోతే అ-త్యా-చా-రా-లు జరిగితే 7 రోజుల్లో చార్జిషీట్ ఎలా వేస్తారు? తగిన న్యాయమూర్తులు లేకపోతే, తగినన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేకపోతే ఎలా కుదురుతుంది? దానిపై పేపర్ వర్క్ కూడా జరగలేదు. ఇవన్నీ పూర్తికాకుండా 21 రోజుల్లో ఎలా న్యాయం జరుగుతుందో చెప్పాలి. దీనికంతటికి సీయం చేతకానితనమో, డీజీపీ చేతకానితనమో, సలహామండలి చేతకానితనమో, హోం మనిష్టర్ చేతకానితనమో సమాధానం చెప్పాలి. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నారు. కల్తీ మద్యంతో, దేశంలో ఏ రాష్ట్రంలో లేని బ్రాండ్లను తెచ్చి జనం ప్రాణాలు తీస్తున్నారు. మద్యం ధరలు పెంచి ప్రజల్ని లూటీ చేస్తున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధమని దశలవారీగా మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెస్తున్నారు. సొంత కంపెనీల నుంచి పిచ్చి మందును తయారుచేసి రూ.25 వేల కోట్లు దోపిడీకి రాచబాట వేస్తున్నారు. మద్యపాన నిషేధ హామీలో మహిళల్ని వంచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read