వైసీపీలో కేసులు ఉంటేనే టికెట్ లు, పదవులు వస్తాయి ఏమో కానీ, చాలా మంది నేతల పై అనేక ఆరోపణలు, కేసులు, జైళ్ళు, బైల్లుతోనే విషయాలు నడుస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలో ఉన్న నేరస్తుల జాబితా పై దేశ వ్యాప్త చర్చ జరుగుతుంది. ఇప్పుడు మరో వైసీపీ నేత కేసుల్లో ఇరుక్కోవటమే కాకుండా, అరెస్ట్ కూడా అయ్యారు. మన రాష్ట్రంలో కాదు లేండి, కంగారు పడకండి. పక్క రాష్ట్రం పోలీసులు మన రాష్ట్రం వచ్చి మరీ, సీక్రెట్ గా ఆపరేషన్ కానిచ్చేసారు. ఆయన విశాఖలో ఒక బడా నేత. కాకపోతే ఓడిపోయారు. 2019లో విశాఖ సిటీ మొత్తం టిడిపి నేతలు గెలిచారు కాబట్టి, అక్కడ వైసీపీ ఓడిపోయింది. లేకపోతే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యే వారు, అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో మరి. ఇక వివరాల్లోకి వెళ్తే, వైసీపీ విశాఖ వెస్ట్ ఇంచార్జ్, అలాగే అక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మళ్ల విజయ్ ప్రసాద్‌, గతంలో ఎమ్మెల్యేగా కూడా చేసారు. ఆయన సేవలు నచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయనకు ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఈయన విశాఖలో ఉండే విజయసాయి రెడ్డికి సన్నిహితుడుగా కూడా ఉన్నారు. అయితే గత రాత్రి మళ్ల విజయ్ ప్రసాద్‌ ను ఒరిస్సా పోలీసులు విశాఖపట్నం వచ్చి, ఆయనను అరెస్ట్ చేసి ఒరిస్సా తీసుకుని వెళ్ళారు.

vizag 07092021 2

అంతకు ముందు విశాఖలో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, వైద్య పరీక్షలు చేసి, మేజిస్ట్రేట్ అనుమతితోనే అదుపులోకి తీసుకుని, విశాఖ తీసుకుని వెళ్ళారు. ఇక ఆయన రూ.1250 కోట్ల స్కాం చేసారు అనేది ఆరోపణ. నమ్మకానికి అమ్మ వంటింది అంటూ, మనం టీవీలలో యాడ్ కూడా చూస్తూ ఉండే వాళ్ళం, అదే వేల్ఫేర్ గ్రూప్ పేరుతో వచ్చిన చిట్ ఫండ్ కంపెనీ. ఈ చిట్ ఫండ్ కంపెనీని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలాల కూడా నిర్వహించారు. అక్కడ డిపాజిట్ దారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి, వారికి తిరిగి చెల్లించ లేదు అనేది అభియోగం. గతంలోనే ఈ విషయంలో కేసులు కూడా నమోదు అయ్యాయి. సిబిఐ కూడా ఎంటర్ అయ్యింది. ఈ కేసు విచారణలో ఉంది. అయితే ఇవన్నీ తెలిసి కూడా, వైసీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వటం, ఓడిపోయినా సరే, సేవలు నచ్చి ఆయనకు ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈయన చేసిన పనులకు ఒరిస్సా పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read