వివేక కేసులో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది సిబిఐ. గత కొన్ని రోజులుగా సిబిఐ మంచి దూకుడు మీద ఉంది. ఈ స్పీడ్ చూసిన వాళ్ళు, అసలు దొంగలకు పట్టుకుంటారని అనుకున్నారు. వాచ్మెన్ రంగన్న దగ్గర నుంచి, సునీల్ యాదవ్, అలాగే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఇతర వైఎస్ ఫ్యామిలీ వారిని కూడా విచారణ చేయటంతో, ఇక దొంగలు దొరికి పోతారని అందరూ అనుకున్నారు. సిబిఐ కూడా నిరంతరాయంగా ఈ కేఎస్ విచారణ చేస్తుంది. దాదాపుగా 75 రోజులుగా ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ కేసు తేలే వరకు వదిలిపెట్టం అనే విధంగా సిబిఐ తీరు ఉండటంతో, ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేస్తుందని అందరూ భావించారు. వివేక కూతురు సునీత కూడా అక్కడే ఉండటంతో, అందరికీ ఆస్తికి నెలకొంది. ఈ తరుణంలోనే సిబిఐ ఈ రోజు అందరికీ షాక్ ఇచ్చింది. ఈ రోజు సిబిఐ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అన్ని పత్రికల్లో కూడా ఈ ప్రకటన ఇచ్చింది సిబిఐ. అందులో వివేక ఫోటో, ఆయన వివరాలు వేసి, ఈ కేసు గురించి వివరాలు, సాక్ష్యాలు చెప్పిన వారికి, అయుదు లక్షల రూపాయాల బహుమతి ఇస్తాం అంటూ, వివేక కేసు గురించి వివరాలు చెప్పాలి అంటూ, సిబిఐ పత్రికా ప్రకటన ఇచ్చింది. కేవలం పత్రికా ప్రకటన మాత్రమే కాదు, అందులో సిబిఐ అధికారుల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు.

cbi 21082021 2

ఎవరైనా సరే వివరాలు తెలిస్తే ముందుకు రావాలని కోరారు. కచ్చితమైన, నమ్మదగిన సమాచారం ఉంటే కనుక, తమ ఫోన్ నెంబర్లు ఫోన్ చేసి చెప్తే, ఆ వివరాలు సరైనవి అయితే, అయుదు లక్షలు బహుమతి ఇస్తాం అంటూ సిబిఐ చెప్పింది. అయితే ఇక్కడే సిబిఐ వైఖరి పై అందరూ ఆశ్చర్య పోయారు. ముఖ్యంగా సిబిఐ అధికారులు, మొన్నటి వరకు ఈ కేసు ముందుకు వెళ్ళిపోతుందని, అందరినీ పట్టుకుంటాం అనే విధంగా ప్రవర్తించి, ఇప్పుడు మాకు ఏమి దొరకలేదు, మీరే వివరాలు చెప్పండి అనే విధంగా ప్రజలను కోరటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావు, తన వద్ద ఈ కేసు గురించి సమాచారం ఉందని, మీకు మొత్తం ఇస్తాను అంటూ సిబిఐ అధికారులకు ఫోన్ చేసినా సరే, ఎందుకు మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావుని సిబిఐ పిలవలేదు, ఆయన నుంచి సమాచారం తీసుకోలేదు అనేది కూడా చూడాలి. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు ప్రకటన ఇవ్వటం పై, సిబిఐ వైఖరి పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read