ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పై, అమరావతి ప్రాంత రైతులు, ఇతరులు, హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు గత హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి విచారణ చేసారు. తీర్పు వస్తుంది అనుకున్న సమయంలో ఆయన బదిలీ పై వెళ్ళారు. అయితే కొత్త చీఫ్ జస్టిస్ రావటంతో, ఈ కేసు విచారణ మళ్ళీ మొదటి నుంచి మొదలైంది. అయితే ఈ కేసు విచారణ గతంలోనే జరగాల్సి ఉండగా, క-రో-నా సెకండ్ వేవ్ కారణంతో వాయిదా పడింది. అయితే ఈ రోజు, అంటే ఆగష్టు 23 నుంచి కేసు విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది. ఈ రోజు నుంచి రోజు వారీ విచారణ మొదలు కావాల్సి ఉంది. దీంతో ఈ రోజు హైకోర్టు ఫుల్ బెంచ్ ముందుకు, ఈ కేసు ఈ రోజు వచ్చింది. చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలో ఈ బెంచ్ ఏర్పాటు అయ్యింది. అయితే కేసు విచారణ మొదలు కాగానే, పిటీషనర్ తరుపు న్యాయవాదులు వాయిదా కోరారు. ఢిల్లీ నుంచి అనేక మంది సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ఈ కేసు ఆన్లైన్ లో వాదించేది కాదని, బౌతికంగా వాదించాల్సి ఉందని, వాయిదా వేయాలని కోరారు. అనేక డాక్యుమెంట్లు ఎవిడెన్స్ లు గా చూపించాల్సి ఉందని అన్నారు. బౌతికంగా వాదనలు వినిపిస్తామని వాయిదా కావాలని కోరారు.

botsa 23082021 2

అయితే క-రో-నా థర్డ్ వేవ్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అంటూ, కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో, ఈ నాలుగు అయిదు వారాలు అత్యంత కీలకం అని, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, బౌతిక విచారణ కష్టం అంటూ మరి కొంత మంది న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం వైపు నుంచి స్పందన అడగగా, పరిస్థితిని బట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా, తమకు అభ్యంతరం లేదని చెప్పారు. నిర్ణయాన్ని కోర్టుకే వదిలేసారు. ఈ నేపధ్యంలో, అందరి అభిప్రాయాలూ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, ఈ కేసుని నవంబర్ 15కి వాయిదా వేసింది. ఇక కోర్టులో జరిగిన విషయాల పై మంత్రి బొత్సా సంచలన వ్యాఖ్యలు చేసారు. రోజు వారీ విచారణ చేస్తాం అని హైకోర్టు చెప్పి, ఇప్పుడు వాయిదా వేసారని, అసలు పిటీషనర్లు ఎందుకు వాయిదా అడిగారు అంటూ ప్రశ్నించారు. కేసు వేసిన వారే వాయిదా అడగటం వెనుక, ఏమైనా దురుద్దేశం ఉందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇదే సమయంలో, విశాఖకు వెళ్లి తీరుతాం అంటూ, కుండబద్దలు కొట్టారు. మరి ఇదే వాదన, హైకోర్టులో ప్రభుత్వం ఎందుకు వినిపించ లేదో అర్ధం కాలేదు. అక్కడ కోర్ట్ నిర్ణయానికి వదిలి పెట్టి, ఇక్కడ ఎందుకు ఇలా చేసారో మరి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read