ముఖ్యమంత్రి జగన్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు చేసిన ప్రసంగమంతా అబద్దాల పుట్టా, అసత్యాల చిట్ట అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య త్రీవ స్ధాయిలో మండిపడ్డారు. ఆదివారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...జగన్ తన ప్రసంగంలో చెప్పిన మాటలు మన రాష్ట్రానికి వర్తించవు, సర్వోతోముఖాభివృద్ది చెందుతూ, రాజ్యాంగ బద్ద పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి రాయాల్సిన ప్రసంగం.. రాసినవారెవరో పొరపాటున మన రాష్ట్రానికి రాసినట్టున్నారు. రాష్ర్టంలో శాంతి భధ్రతలు బాగున్నాయని సీఎం చెప్పటం, అది విని డీజీపీ ఆనందించటం హాస్యాస్పదం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే గుంటూరులో దళిత యువతి రమ్య హ-త్య-కు గురైంది, అర్ధరాత్రి మహిళలు స్వేచ్చగా తిరిగిన నాడే దేశానికి స్వాతంత్ర్యం అని గాంధీ అన్నారు, వైసీపీ పాలనలో మహిళలు పట్టపగలు తిరగడానికే భయపడుతున్నారు. రాష్ర్టంలో మహిళలపై గంటకు 39 నే-రా-లు జరుగుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి, ఇది నిజమైతే రాష్ర్టంలో పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే శాంతి భద్రతలు బాగున్నాయని ముఖ్యమంత్రి, డీజీపీ ఎలా చెబుతారు? రమ్య హ-త్య-కు ఎవరు బాధ్యులు ? రాష్ట్రంలో ఏం జరిగినా తాడేపల్లి గుహ నుంచి ముఖ్యమంత్రి బయటకు రారు, రమ్య కుటుంబానికి ఎవరు సమాదానం చెబుతారు? రాష్ట్రంలో అవినీతి, విలువల పతనం, స్వార్దం, కులం, మతం, ప్రాంతం వైషమ్యాలు పెరిగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి రాష్ర్టంలో అంతా బాగుందని చెప్పటం కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగిన చందంగా ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాడే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల, ప్రతిపక్ష పార్టీల స్వాతంత్ర్యం హరించబడింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలకే స్వాతంత్ర్యం వచ్చింది. రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (భావప్రకటనా స్వేచ్చ ) అమలవుతుందా? రాష్ట్రాన్ని ప్రతికార కుంపటిగా మార్చారు, ప్రతిపక్షాలపై ఇనుప పాదాలు మోపి అణిచివేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేపటికి ఏం భరోసా ఇస్తారు? సామాజిక న్యాయం అంటూ జగన్ మాట్లాడటం వింతగా ఉంది, నేతిబీరకాయలో నెయ్యి ఉండదు, జగన్ చెప్పిన సామాజిక న్యాయంలో న్యాయం ఉండదు, ప్రాధాన్యత కల్గిన కార్పోరేషన్లనన్నీ తన అస్మదీయులకు కట్టెబెట్టి ప్రాదాన్యత లేని పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు, దళితులకు, బీసీలకు ప్రాధాన్యత కల్గిన ఆర్టీసీ చైర్మన్, ఏపీఐఐసీ వంటి చైర్మన్ పదవులు ఎందుకివ్వలేదు?

మంత్రి పదవి కోసం వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటు. అంబేద్కర్ దళితులకే రాజ్యాంగం రాశారని, బీసీలకు జగన్ ప్రత్యేకంగా రాజ్యంగం రాస్తున్నారని అవగాహన లేకుండా జోగి రమేష్ మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించటమే. ప్రత్యేక రాజ్యాంగం రాయడానికి పార్లమెంట్ దగ్గర అనుమతి తీసుకున్నారా? అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని అవమానించిన జోగి రమేష్ పై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. దళిత జడ్జి రామకృష్ణపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానించిన జోగి రమేష్ పై ఎందుకు చర్యలు తీసుకోదు. రేపు డీజీపీ ఆఫీస్ కి వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని వర్ల రామయ్య తెలిపారు. అన్ని కులాలను సమానంగా చూడాల్సిన ముఖ్యమంత్రి ఒక్క కులానికే అధిక ప్రాధాన్యత ఇవ్వటం సరికాదు. కుర్చీలు, బల్లాలు లేని కార్పోరేషన్లు ఏర్పాటు చేసి ప్రచారం తప్ప...వారికి ఏం చేశారు? ఎస్సీ కార్పోరేషన్ ని 3 విభాగాలు చేశారు కానీ, రెండున్నరేళ్లలో కార్పోరేషణ్ల ద్వారా కనీసం ఒక్కరికైనా రుణం ఇచ్చారా? ఒక్కరికైనా ఒక ఇన్నోవా కారు ఇచ్చారా? టీడీపీ ప్రభుత్వంలో దళిత యువతకు కార్లు, రుణాలు ఇచ్చి ఆర్దికంగా ఆదుకున్నాం. కానీ ఇప్పుడు చైర్మన్లకు కార్లకు సామాజికన్యాయం అనటం సిగ్గుచేటు, మీ ప్రభుత్వ పాలన వైఖరితో వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలు, నాయకులు మింగలేక, కక్కలేక ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని రుణాలు ఇచ్చామో..వైసీపీ పాలనలో ఎన్ని రుణాలు ఇచ్చారో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన దళిత నాయకులు చెప్పాలి.

టీడీపీ హయాంలో దళితుల అభ్యున్నతికి రూ. 14 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిదుల్లో గోల్ మాల్ జరిగింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించిన రూ. 15 వేల కోట్లలో కేవలం రూ. 4700 కోట్లు ఖర్చు చేసి మిగతా నిధులు నవరత్నాలకు, ఉద్యోగుల జీతాలకు దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేశారు. చట్ట ప్రకారం దళితులకు వాడాల్సిన నిధుల్ని దారిమళ్లించిన వైసీపీ ప్రభుత్వం శిక్షార్హం, కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. రైతు భరోసా రూ 7500 ఇస్తూ రూ. 13500 ఇస్తున్నామనటం మోసం చేయటమే. దాన్యం కోనుగోలు కేంద్రాలకు రూ. 33 వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక నడిరోడ్డుపై పంటను పారిపోయటం ముఖ్యమంత్రి కళ్లకు కనపడటం లేదా? రైతులకు చేస్తున్నామన్న న్యాయం అంతా మిధ్య. ప్రతి నెలా 1 వ తారీఖున ఉద్యోగాలివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంటే ప్రతి నెలా 1 తారీఖునే ఫించన్ ఇస్తున్నామని అబద్దాలు చెబుతున్నారు. వాలంటీర్లకు ఉద్యోగాలిచ్చి అవే ప్రభుత్వ ఉద్యోగాలని లెక్కలు చెబుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పి ఆత్మవంచన చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఉపన్యాసమంతా ప్రజా వ్యతిరేక ప్రసంగం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read