సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఈ రోజు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, ఎన్వీ రమణ, జాతీయ పతకాన్ని ఎగరవేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ లో చేస్తున్న చట్టాల తీరు పైన జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం పార్లమెంట్ లో చట్టాలు చేస్తున్న తీరు చాలా విచారకరంగా ఉందని ఎన్వీ రమణ అన్నారు. చట్టాలు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో కూడా, అర్ధం కాని పరిస్థితి తలెత్తిందని అన్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. చట్టాల్లో ఎన్నో లోపాలు ఉంటున్నాయని, దీని పై కోర్టులో కూడా వ్యాజ్యాలు జరుగుతున్నాయని, ఇలాంటి లోపభూయిష్ట చట్టాలు, ప్రజలకు, ప్రభుత్వాలకు కూడా భారం అవుతున్నాయని అన్నారు. న్యాయవాదులు ప్రజా జీవితంలోకి కూడా రావాలని, చట్టసభలకు కూడా రావాలని, పార్లమెంట్ లో ఒకప్పుడు న్యాయ దిగ్గజాలు సభ్యులుగా ఉండే వారని, ప్రస్తుతం ఉన్న తీరు మారాలని అన్నారు. చట్టాల పై చర్చలు జరగకుండా ఉంటే ఇబ్బందులు వస్తయాని అన్నారు. ప్రతి చట్టం పై పార్లమెంట్ లో నాణ్యమైన చర్చ జరిగక పోతే, న్యాయపరమైన చిక్కులు వస్తయాని అన్నారు.
చర్చలు జరగని కారణంగా, అసలు కొత్త చట్టాల ఉద్దేశం ఏమిటో కూడా తెలియకుండా పోతుంది అంటూ, జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇప్పుడు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక వ్యవస్థ పని తీరు పై, మరో వ్యవస్థ మాట్లాడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఒక వ్యవస్థ గాడి తప్పుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే, ఇలా వేరే వ్యవస్థ మాట్లాడుతుంది. అయితే జస్టిస్ ఎన్వీ రమణ మాత్రం చాలా ధైర్యంగా జరుగుతున్న విషయం చెప్పారు. గత పార్లమెంట్ సమావేశాలు ఎలా జరిగాయో అందరూ చూసారు. ఎక్కడా చర్చ జరగకుండా, దాదాపుగా 19 బిల్స్ ని ఆమోదించారు. అసలు ఆమోదించిన బిల్స్ ఏమిటో కూడా ప్రజలకు తెలియదు. ఈ నేపధ్యంలోనే చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయినా వ్యవస్థల తీరుని ప్రశ్నిస్తున్నారు. సిబిఐ, ఈడీ, పోలీసులు, వ్యవస్థలు ఇలా అందరి పని తీరుని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి, ఇది ఎంత వరకు వెళ్తుందో.