మెగాస్టార్ చిరంజీవికి, జగన్ మోహన్ రెడ్డిని పిలుపు వచ్చింది. తనని వచ్చి కలవాల్సిందిగా జగన్ మోహన్ రెడ్డి, చిరంజీవికి సందేశం పంపించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని, చిరంజీవికి ఫోన్ చేసి, జగన్ మోహన్ రెడ్డిని కలవాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే ముఖ్యంగా ఈ భేటీ వెనుక కారణం ఏమిటి అంటే, ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదుర్కుంటున్న ఇబ్బందులు ఏమిటో వివరించాలని, చిరంజీవి మాత్రమే కాకుండా, ఇతర సినీ పెద్దలు కూడా వచ్చి కలవాలని పేర్ని నాని చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, చిరంజీవితో పాటుగా, ఇతర సినీ ప్రముఖులు వచ్చే వారం జగన్ ని కలిసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని కూడా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలోని అనేక సమస్యలు ఈ సందర్భంగా చర్చించనున్నారు. క-రో-నా కారణంగా షూటింగ్లు లేక పరిశ్రమ వర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి.. అలాగే థియేటర్ల యాజమాన్యాలు కూడా అనేక సమస్యలు ఎదుర్కుంటున్నాయి. థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవటానికి ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు షోలు నడుస్తున్నాయి. దాన్ని నాలుగు షోలకి, అవసరం అయితే అయుదు షోలకి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు.
ఇక అలాగే టికెట్ ధరల విషయంలో కూడా అనేక అభ్యర్ధనలు సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రెట్లు తగ్గించి వేయటంతో, పరిశ్రమ ఇబ్బందులు పడుతుందని చెప్తున్నారు. ఇలా అనేక సమస్యలతో సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతుంది. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, గత ఏడాది కూడా ఇలాగే సినీ ప్రముఖులు వచ్చి జగన్ ని కలిసి వెళ్ళారు. ఆ సమయంలో అనేక హామీలు ఇచ్చినట్టు చెప్పారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి హామీలు అమలు అయ్యయో చిరంజీవి గారే చెప్పాలి. ఇక ఈ భేటీల పై మరో కోణం కూడా ఉంది. ఇదంతా రాజకీయం కోసం చేస్తున్న ఎత్తుగడగా చెప్పే వారు కూడా ఉన్నారు. ఏపి ప్రభుత్వం ముఖ్యంగా చేయాల్సింది సినీ పరిశ్రమ వర్గాలకు, థియేటర్లకు రాయతీలు ఇవ్వటం. అవి ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదు. మరి ఎందుకు చిరంజీవి వచ్చి కలుస్తున్నారో తెలియదు. అయితే ఈ సారి అయినా, ఒట్టి మాటలు కాకుండా, నిజంగా ఏమైనా హామీలు నెరవేర్చుతారేమో చూడాలి.