ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ నిర్ణయంతో, మనకు జీవోలు ఆన్లైన్ లో కనిపించవు. ఇటీవల బ్లాంక్ జీవోల విషయంలో, ప్రభుత్వ వైఖరి తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఆ జీవోలో ఏమి లేకుండా, కేవలం బ్లాంక్ జీవోలు అనేకం విడుదల చేసారు. అసలు అందులో ఏమి ఉందో, ఏమి లేదో చెప్పకుండా, కేవలం బ్లాంక్ జీవో ఇవ్వటం వివాదాస్పదం అయ్యింది. అలాగే అర్ధరాత్రి పూట నిర్ణయాలు తీసుకుంటూ కూడా, జీవోలు విడుదల చేసారు. ఇక రహస్య జీవోలు కూడా అనేకం విడుదల అయ్యాయి. దీని పై ప్రతిపక్షం టిడిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ అంశం పై గవర్నర్ కూడా షాక్ అయినట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జీవోలు ఏమి ఆన్లైన్ లో ఉంచకూడదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవోలు అన్నీ ఇక నుంచి ఆఫ్ లైన్ లోనే పెట్టాలని అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, ఉత్తర్వులు జారీ చేసారు. మెమో రూపంలో అన్ని శాఖల కార్యదర్శులకు ఈ ఉత్తర్వులు జారీ చేసారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అనుసరిస్తూ, ఆన్లైన్ లో జీవోలు పెట్టటం నిలిపి వేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గత అనేక ప్రభుత్వాల నుంచి జీవోలు ఆన్లైన్ లో ఉంచటం ఆనవాయితీగా వస్తుంది. ప్రజలకు పారదర్శకంగా, ప్రభుత్వ నిర్ణయాలు అందిస్తూ, ప్రజల ముందే సమాచారం ఇస్తూ, ధైర్యంగా నిన్నటి వరకు ప్రభుత్వాలు నడిచాయి. ప్రభుత్వం జారీ చేసే అన్ని ఉత్తర్వులు కూడా ఆన్లైన్ లోనే జారీ చేస్తూ వచ్చారు. ప్రజలకు కూడా ఇది అందుబాటులో ఉండటంతో, ప్రజలు కావలసినప్పుడు ఆన్లైన్ లోకి వెళ్లి కావాల్సిన సమాచారం చూసే వారు. అయితే ఇక నుంచి మాత్రం, ఆన్లైన్ లో ఎలాంటి సమాచారం అప్లోడ్ చేయవద్దు అని కూడా, అన్ని శాఖల కార్యదర్సులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, సంచలనంగా మారింది. అయితే ఈ నిర్ణయం పై ప్రతిపక్షాలు పలు అనుమానాలు లేవనెత్తాయి. ఆన్లైన్ లో ఉంటేనే ఇన్ని అరాచకాలు చేస్తున్నారని, ఆఫ్ లైన్ లో ఆదేశాలు విడుదల అయితే, ప్రజలకు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి, ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అనే నిర్ణయంతోనే, ప్రభుత్వం ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అంటూ, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.