ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో స్వాత్రంత్య దినోత్సవ వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకులు జరిగాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. క-రో-నాని దృష్టిలో పెట్టుకుని, ప్రజలకు ఈ వేడుకుల్లో పాల్గునే అవకాసం ఇవ్వలేదు. ఇక జెండా వందనం అనంతరం, జగన్ మోహన్ రెడ్ది ప్రసంగించారు. సహజంగా స్వాత్రంత్య దినోత్సవం రోజు ఇచ్చే ప్రసంగంలో తమ ప్రభుత్వం చేస్తున్న పనులు అన్నీ గొప్పగా చెప్తారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా, గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల గురించి చెప్తూ వచ్చారు. ఈ సారి కూడా అదే విధంగా ప్రసంగం సాగింది. అయితే గత రెండేళ్ళ కంటే భిన్నంగా ఈ సారి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం సాగింది. ముఖ్యంగా తమ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న మూడు రాజధానుల ప్రస్తావన ఈ ప్రసంగంలో లేకపోవటంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఇంత పెద్ద విషయం పై, జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ప్రస్తావించలేదు అనే చర్చ జరుగుతుంది. అక్కడ ఉన్న నాయకులు, అధికారులు, మీడియా కూడా జగన్ ప్రసంగంలో మూడు రాజధానుల విషయం లేకపోవటం పై ఆశ్చర్య పోయారు. ఈ విషయం ఎందుకు ప్రసంగంలో చెప్పలేదో అంటూ చర్చించుకున్నారు.

jagan 15082021 2

అనేక ఇతర విషయాల పై జగన్ మాట్లాడారు. సంక్షేమం గురించి ఎక్కువగా చెప్పారు. అయితే ఈ సారి అనూహ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మధ్య కాలంలో జీతాలు ఇవ్వటం సమయానికి ఇవ్వటం లేదు, సిపీఎస్ రద్దు, డీఏలు, పీఆర్సి ఇలా అనేక విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపధ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి వారి గురించి ఇక్కడ ప్రస్తావన చేసారు. ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, అవి తనకు కూడా తెలుసు అని, త్వరలోనే వాటి పరిష్కారం కూడా చూస్తామని జగన్ అన్నారు. మొత్తంగా, ప్రభుత్వం ఎదుర్కుంటున్న ఆర్ధిక సంక్షోభాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఈ సారి జగన్ ప్రసంగంలో ఎక్కువగా సంక్షేమం పైనే ఉండటం, ప్రభుత్వ ఉద్యోగులను మంచి చేసుకోవాలని అనుకోవటం, అలాగే ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన అనేది లేకపోవటం, ఇవన్నీ గమనించాల్సిన అంశాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో, ఉద్యోగులను విశాఖ తరలించటం దాదాపు అసాధ్యం అని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read