ఇప్పటికే తెలుగు అకాడమీలో భారీ స్కాం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపిలో మరో స్కాం బయట పడింది. ఏపీ గిడ్డంగుల కార్పొరేషన్ నుంచి రూ.9 కోట్లను కేటుగాళ్లు కొట్టేసారు. కార్పొరేషన్ ఎఫ్ డీల నుంచి నిధులు గల్లంతు అయినట్టు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, "కార్పొరేషన్ కు చెందిన మొత్తం రూ.32 కోట్లు ఎఫ్ డీల రూపంలో ఉన్నాయని అన్నారు. తెలంగాణ పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. భవానీపురం IOB లోని FD నుంచి 9 కోట్ల 60 లక్షలు కొట్టేశారని, మొత్తం 34FDలకు... IOBలో నగదు గల్లంతు అయినట్లు గుర్తించాం అని అన్నారు. బ్యాంక్ అధికారులతో మాట్లాడాం, విచారణ జరుగుతోంది అని అన్నారు. ప్రభుత్వ FDలు గల్లంతు అవ్వడంతో విస్తుపోయాం అని అన్నార్. FDలు మెచ్యూర్ అవ్వడానికి ముందే నిధులు తరలించారని, అంతర్గత విచారణ ఉంటుందని,దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం అని అన్నారు. మేము చేసిన FD లు మొత్తం తిరిగి చెల్లించేందుకు IOB అధికారులు అంగీకరించారని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ తెలిపారు. అయితే ఇలా రోజుకి ఒక కార్పొరేషన్ లో స్కాం బయట పడటం, గమనించాల్సిన అంశం.
మరో విస్తుపోయే ఘటన... ప్రభుత్వ సొమ్ము మాయంతో అవాక్కయిన అధికారులు...
Advertisements