ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు వారాలుగా, డ్ర-గ్స్ స్కాం ఒక సెన్సేషన్ అయ్యింది. ఆఫ్గన్ నుంచి గుజరాత్ పోర్ట్ కు వచ్చిన హెరాయిన్ ని అధికారులు పట్టుకున్నారు. అయితే దాని మీద విజయవాడ అడ్రెస్ ఉండటంతో, మొత్తం సీన్ ఏపికి షిఫ్ట్ అయ్యింది. ఆషి ట్రేడింగ్ కంపెనీ పెట్టిన వ్యక్తికి కాకినాడ లింకులు ఉండటం, ఆ లింక్ వైసీపీ ఎమ్మెల్యే వరకు ఉందని టిడిపి ఆరోపించటం, బిగ్ బాస్ ఎవరు అంటూ, టిడిపి పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. విమర్శలకు తగ్గట్టే పరిణామాలు జరగటంతో, వైసీపీ కూడా అలెర్ట్ అయ్యింది. ఎదురు దాడి చేసింది. అయినా టిడిపి వదిలి పెట్టలేదు. బిగ్ బాస్ ఎవరు అంటూ, రోజుకొక కొత్త విషయంతో, మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ విచారణలో, విజయవాడలో కూడా సోదాలు చేయటం, కొన్ని పత్రాలు సీజ్ చేయటంతో, ఏపిలో కార్యకలాపాలు నిజమే కదా అంటూ, టిడిపి ఎదురు దాడి మొదలు పెట్టింది. అయితే ఈ విషయం సీరియస్ అవ్వటం, ప్రజల్లోకి బాగా వెళ్ళటం, టిడిపి ఇదే విషయం పట్టుకుని వేలాడటంతో, ప్రభుత్వం కూడా ఎదురు దాడి చేస్తూ, పోలీసుల చేత, ఎదురు దాడి చేపించింది. డీజీపీ పేరిట, పోలీసులతో, టిడిపి నేతలకు నోటీసులు ఇప్పించింది.
నారా లోకేష్ తో పాటుగా, రామ్మోహన్ నాయుడు, ధూళిపాళ్ళ నరేంద్ర, పట్టాభి, బుద్దా వెంకన్న, బోండా ఉమాతో పాటుగా, మీడియా అధినేతలు, ఎడిటర్లకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తూ, వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలని, రీజాయిండర్ కూడా పేపర్ లో వేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి చేత నోటీసులు ఇప్పించారు. అయితే ఈ నోటీసులతో టిడిపి వెనక్కు తగ్గుతుందని అనుకున్నా, ఈ రోజు మళ్ళీ టిడిపి మొదలు పెట్టింది. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన పట్టాభి, తాము ప్రతిపక్షంగా అన్ని విషయాలు ప్రజలకు చెప్తాం అని, మీరు ఇచ్చే నోటీసులు మాకు చిత్తు కాగితాలతో సమానం అని, ఏమి పీక్కుంటారో పీక్కోండి అంటూ, డిజిపిని ఉద్దేశించి, ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు విజయవాడలో ఎన్ఐఏ అధికారులు ఎందుకు వచ్చారో డిజిపికి తెలియదా అంటూ వ్యాఖ్యానించారు. డిజిపి తాటాకు చప్పుళ్ళకు భయ పడం అని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, డిజిపికి వచ్చిన బాధ ఏమిట్ అంటూ, పట్టాభి ఈ రోజు ప్రశ్నించారు.