ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిదీ వింతగానే ఉంటుంది. ఈ రాష్ట్రంలో జరిగే పనులు అన్నీ ఎప్పుడూ చూడని పనులు జరుగుతూ ఉంటాయి. మాస్కు అడిగితే డాక్టర్ ని పిచ్చోడు అంటారు, ఎంపీ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు, ప్రతిపక్ష నాయకులే బాధితులు అయినా, వారి పైనే ఎదురు కేసులు పెడతారు. అదేమీ అంటే, భావప్రకటనా స్వేఛ్చతో అధికార పార్టీ వాళ్ళు చేస్తే, దానికి ఎదురు ఎలా చెప్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎన్నో ఎన్నో వింతలూ విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో ఏకంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా భాగస్వామ్యం అవ్వటం, హైలైట్ అని చెప్పాలి. సహజంగా డీజీపీ అంటే, రాష్ట్రంలో అందరికీ డీజీపీనే. సహజంగానే కొంత ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడైనా సర్వ సాధారణం. ఎక్కడైనా ప్రభుత్వ పాలసీలకు తగ్గట్టు ఉండాలి కాబట్టి, కొంత అనుకూలంగా పని చేసినా, లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం, ఎవరినీ ఉపెక్షించరు. గతంలో ఇలాంటి డీజీపీలను చూసే వాళ్ళం. ప్రస్తుతం ఏపిలో ఉన్న గౌతం సవాంగ్ గారికి మంచి పేరే ఉండేది. గతంలో విజయవాడ కమీషనర్ గా, చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంతో, టిడిపి వారిని కూడా స్పేర్ చేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం, డీజీపీ వ్యవహార శైలి పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

dgp 15102021 2

ముఖ్యంగా డీజీపీ గారు ఈ మధ్య తరుచూ ప్రెస్ మీట్లు పెడుతూ, వైసీపీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం వస్తుంది. టిడిపి పార్టీ నాయకులను, ప్రతిపక్షం అని సంబోధించటం పలువురుని ఆశ్చర్య పరుస్తుంది. పోలీసులకు ప్రతిపక్షం, అధికార పక్షం ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా హెరాయిన్ వ్యవహారం ఏపిని కుదిపేస్తుంది. ఎన్ఐఏ వచ్చి విజయవాడలో సోదాలు చేయటంతో, ఇది మరో టర్న్ తీసుకుంది. అయితే టిడిపి నేతలు ప్రభుత్వం పై, ప్రభుత్వంలోని కొంత మంది పెద్దల పై అనేక ఆరోపణలు చేసారు. అయితే దీనికి ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి కాని, అనూహ్యంగా డీజీపీ రియాక్ట్ అయ్యి, ఆరోపణలు చేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పాలని కోరారు. అసలు ప్రతిపక్ష నేతలపై డీజీపీ స్థాయి అధికారి, ఇలా లీగల్ నోటీసులు పంపించటం, దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఆరోపణలు చేసింది ప్రభుత్వ పెద్దల పై అయితే, డీజీపీ స్పందించటం, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు అంటూ లీగల్ నోటీసులు పంపించటం పై పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read