అమరావతి అంటే చాలు జగన్ ప్రభుత్వానికి ఎందుకో భయం పట్టుకుంది. ఆ పేరు వింటేనే భయంగా ఉంది. గతంలో తెలుగుదేశంలో తెలుగు ఉందని, తెలుగు భాషని తీసి వేస్తున్నారు అంటూ రాజకీయంగా విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమరావతి అంటే అదేదో తెలుగుదేశం ఆస్తి అయినట్టు, అమరావతి మీద కక్ష చూపిస్తున్నారు. అమరావతి అంటే వెయ్యి ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రాంతం, అమరావతిని ఆసరాగా చేసుకుని ఈ దేశాన్ని కూడా ఏలిని చరిత్ర శాతకర్ణిది. ఈ చరిత్ర అంతా పదవ తరగతి పుస్తకాల్లో నాటి ప్రభుత్వం పెట్టింది. అమరావతి చరిత్రతో పాటు, అమరావతిని రాజధానిగా చేసిన తీరు, నిర్మాణాలు ఇవ్వన్నీ ఒక లెసన్ గా పెట్టారు. అయితే అమరావతి అంటేనే భయం ఉన్న ఈ ప్రభుత్వం, ఆ లెసన్ ని తీసి వేస్తూ కొత్త పుస్తకాలు ప్రచురించింది. పాత పుస్తకాలు వెనక్కు పంపించి, కొత్త పుస్తకాలు అమరావతి లేకుండా పెట్టారు. ఈ చర్య పై పలువురు మండి పడుతున్నారు. మన రాజకీయ స్వార్ధం కక్ష కోసం, ఏళ్ళ నాటి మన సంస్కృతీ, చరిత్ర, మన ఖ్యాతిని ఇలా తక్కువ చేయటం ముర్ఖత్యం అని వాదిస్తున్నారు. ఇలాంటివి ఎన్నో చేసిన ఈ ప్రభుత్వం మారుతుందా ? మారదు కదా ?
అమరావతికి మరో షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం... ఎందుకంత భయం ?
Advertisements