ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా మతపరమైన సున్నిత అంశాలలో కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదానికి తావు ఇస్తున్నాయి. పదో తారిఖు నిర్వహించే వినాయక చవతి ఉత్సవాల విషయం పై ఏపి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. వినాయక చవతి ఉత్సవాలు ఇంట్లో మాత్రమే చేసుకోవాలి అంటూ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ప్రభుత్వం మాత్రం క-రో-నా నిబంధనలు సాకుగా చూపుతుంది. దీని పై అనేక విమర్శలు వచ్చాయి. వైసీపీ చేసుకునే వర్ధంతి, జయంతి, పుట్టిన రోజు కార్యక్రమాలకు లేని కరోనా, కేవలం హిందూ పండుగులకే ఎందుకు అంటూ విమర్శలు వచ్చాయి. నిబంధనలు పాటిస్తూ, షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలి అంటూ, గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. టిడిపి నేతలు ఈ విషయం పై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసారు. అయినా ప్రభుత్వం మాత్రం ఎక్కడా దిగి రాలేదు. తాము చెప్పిందే ఫైనల్ అనే విధంగా, అధికార పార్టీ నేతలు సమర్ధించుకున్నారు. మీ కార్యక్రమాల సంగతి ఏమిటి అంటే జవాబు లేదు. ఈ నేపధ్యంలోనే, ఈ విషయం కూడా కోర్టు ముందుకు వెళ్ళింది. ప్రభుత్వం నిర్ణయం పై లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు అయ్యింది.
అయితే ఈ లంచ్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు, ప్రభుత్వానికి కొంచెం అనుకూలంగా, అలాగే పిటీషనర్ కు కూడా కొంచెం అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రైవేటు స్థలాల్లో చేసుకునే వినాయక చవితి ఉత్సవాలు న్రివహించుకోవచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చింది. కో-వి-డ్ నిబంధనలు పాటిస్తూ, ఒకేసారి అయుదు మంది కంటే ఎక్కువ మించకుండా ప్రైవేటు స్థలాల్లో పూజలు చేసుకోవచ్చు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మతపరమైన కార్యక్రమాలు నిరోధించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. అయితే పబ్లిక్ స్థలాల్లో మాత్రం విగ్రహాలు పెట్టుకోవటానికి హైకోర్టు అభ్యంతరం చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ప్రైవేటు స్థలాలో పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే నిబంధనలు తప్పని సరిగా పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం మీద, ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోవచ్చు అని చెప్పటంతో, కొంత ఊరట లభించినట్టే.