జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాకి, నాంపల్లి సిబిఐ కేసులో షాక్ తగిలింది. తీర్పులు ముందే చెప్పేస్తూ, అత్యుత్సాహం ప్రదర్శించటంతో సాక్షి మీడియాకు షాక్ తగిలింది. ఇక విషయానికి వస్తే, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తూ వేసిన పిటీషన్ పై, ఆగష్టు 25వ తేదీన సిబిఐ కోర్టు తీర్పు చెప్తాం అని చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం, ఆ తీర్పు ఏమి వస్తుందా అనే టెన్షన్ తో ఉదయం నుంచి టీవీలకు అతుక్కు పోయి కూర్చున్నారు. జగన్ బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు కూడా టెన్షన్ తో టీవీల ముందు కూర్చున్నారు. అయితే వెంటనే సాక్షి టీవీ చేసిన ట్వీట్ తో అందరూ షాక్ అయ్యారు. జగన్ బెయిల్ రద్దు చేస్తూ రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది అంటూ, సాక్షి ట్వీట్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే అది వైరల్ అయ్యింది. అయితే ఎంత సేపటికి మిగతా టీవీ చానల్స్ లో మాత్రం ఆ వార్త రావాటం లేదు. పైగా విజయసాయి రెడ్డి పిటీషన్ పైనే విచారణ జరుగుతుంది అంటూ వార్తలు వచ్చాయి. చివరకు మరి కొద్ది సేపటికి ఆ ట్వీట్ ని సాక్షి డిలీట్ చేసింది. అంతే కాదు, ఇంకో ట్వీట్ చేసి, పొరపాటున జరిగిన విషయంగా చెప్తూ, ట్వీట్ చేసింది. అప్పుడు కానీ సాక్షి తప్పుడు ట్వీట్ చేసింది అనే విషయం అర్ధం కాలేదు.
అయితే ఈ విషయం పై రఘురామరాజు సీరియస్ అయ్యారు. అసలు కోర్టులో జడ్జిమెంట్ రాకుండా, మీరు ఎలా ముందే చెప్తారు అంటూ అనుమానం వ్యక్తం చేసారు. దీని వెనుక కుట్ర ఉందని అన్నారు. దీని పై కేసు వేస్తున్నట్టు చెప్పారు. చెపినట్టుగానే, సాక్షి మీడియా పై రఘురామకృష్ణం రాజు సిబిఐ కోర్టులో, కోర్టు దిక్కరాణ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై ఈ రోజు నాంపల్లి సిబిఐ కోర్టు విచారణ చేసింది. ఒక పక్క కేసు ఇంకా కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉండగానే, పిటీషన్ కొట్టి వేసారు అంటూ, సాక్షి మీడియాలో కధనం వచ్చిందని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కోర్టు సాక్షి ఎడిటర్ మురళి, సీఈఓ వినయ్ మహేశ్వరికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ రోజు విచారణకు రాగా, కౌంటర్ దాఖలు చేయటానికి 15 రోజులు టైం అడిగారు. కోర్టు మాత్రం అదేమీ కుదరదు అని, సోమవారం లోగా కౌంటర్ దాఖలు చేయాలి అంటూ షాక్ ఇచ్చింది. దీంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.