ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో కొన్ని కీలక పిటీషన్ల పై, ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్ళాయి. అలంటి ఒక కేసులోనే, హైకోర్టు రాష్ట్ర డీజీపీకి సంచలన ఆదేశాలు ఇచ్చింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో, 107 సిఆర్పీసి కింద, పరుసురాముడు అనే వ్యక్తి పై దాఖలైన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ , ఈ రోజు, ఆయన హైకోర్టులో పిటీషన్ వేసారు. ఈ ఎఫ్ఐఆర్ కొట్టివేయలి అంటూ, క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పైనే ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. పిటీషనర్ తరుపు న్యాయవాది కృష్ణా రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ విధంగా పోలీసులు ప్రవర్తించటం అన్యాయం అని అన్నారు. మాములుగా అయితే 107 సీఆర్పీసి కింద ఎవరు అయినా అల్లర్లు కానీ, ఆందోళనలు కానీ చేస్తారు అనే ముందస్తు సమాచారం ఉంటేనే, అటువంటి వ్యక్తులను బైండ్ ఓవర్ చేసే విధంగా, తాహిసిల్దార్లకు అధికారాలు ఉంటాయని, ఈ అధికారాలను పోలీసులు లాగేసుకుని, 107 సిఆర్పీసి కింద కేసులు నమోదు చేస్తున్న విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. అదే విధంగా, 107 సిఆర్పీసి కింద కేసులు నమోదు చేసి, ఆ తరువాత అటువంటి వ్యక్తుల పైన రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నారు అంటూ, కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలా చేయటం, వ్యక్తుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించటమే అని అన్నారు.

dgp 08092021 2

ఈ వాదనల నేపధ్యంలోనే హైకోర్టు కూడా, న్యాయవాది కృష్ణా రెడ్డి వాదనలతో ఏకీభావించింది. పైగా వ్యక్తుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే విధంగా, తాహసీల్దార్ కు సంబంధించిన అధికారాలను, పోలీసులు చేజిక్కించుకునటం పై, హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ఇటువంటి అనేక పిటీషన్లు, తమ ముందుకు వచ్చాయని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్లే పరుశురాముడు అనే వ్యక్తి పై, అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. రాష్ట్రంలో 107 సిఆర్పీసి కింద స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఎవరూ కూడా కేసులు నమోదు చేయటానికి వీలు లేదని, ఈ మేరకు డీజీపీ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్ఐలకు హైకోర్టు ఆదేశాలు చెప్పాలని, స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి అంటూ, హైకోర్టు మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. దీనికి సంబంధించి, డీజీపీ వెంటనే అన్ని పోలీస్ స్టేషన్ లకు, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అంటూ, కోర్టు ఉత్తర్వులు జరీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read