అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తుంది. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములను అదే విధంగా, మద్యం పై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా ఎస్క్రో చేసి, రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్‌డీసీ ద్వారా, ఆరు బ్యాంకుల కన్సార్టియం నుంచి 25 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని రావటానికి, ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అంగీకారం కూడా కుదిరింది. అయితే ఇప్పటికే ఈ విషయంలో రూ.21,500 కోట్ల రుణం తీసుకున్న తరువాత ఇది బయటకు తెలియటంతో, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఇప్పటికే ఎఫ్ఆర్బియం పరిమితికి మించి అప్పులు చేసారని, ఇదే విధంగా అప్పులు చేయటం, కార్పోరేషన్ల ద్వారా తీసుకుని వచ్చే రుణాల పై కూడా తమకు లెక్కలు చెప్పాలని చెప్పి, కాగ్ ఆదేశించింది. బ్యాంకులు నుంచి, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల పై కూడా తమకు లెక్కలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నేపధ్యంలోనే ఏపి ప్రభుత్వం ఈ లెక్కలు సరిగ్గా ఇవ్వకపోయినా, ఇటీవల కాలంలో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏపీఎస్‌డీసీ ద్వారా, ఇప్పటికే రూ.21,500 కోట్లను అప్పుగా తీసుకున్న ఏపి ప్రభుత్వం, మరో 3500 కోట్ల అప్పు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వద్దని, మౌఖికంగా ఆదేశించటం, కార్పోరేషన్ల ద్వారా అప్పులు ఇవ్వద్దు అని తేల్చి చెప్పటంతో, బ్యాంకులు వెనకడుగు వేసాయి. ఈ నేపధ్యంలోనే, మద్యం పై ఆదాయం ఎస్క్రో చేయటం, అలాగే విశాఖలో ఉండే రూ.1,600 కోట్ల భూములు మీకు తాకట్టు పెడతాం అని చెప్పి, అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారానికి వచ్చినా, మిగతా అప్పు రాలేదు. అయితే మిగత 3500 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేయటంతో, విశాఖలో ఉండే భూములు తాకట్టు పెడతాం అని చెప్పిన భూములు, తమ పేరిన రిజిస్టర్ చేయాలని కోరటంతో, గత నెల 28 వ తేదీన, విజయవాడలో ఉన్న గాంధీ నగర్ రిజిస్టర్ కార్యాలయంలో, తాకట్టు రిజిస్టర్ చేసారు. విశాఖలో అత్యంత విలువైన 13 భూములను, రూ.1,600 కోట్ల కోసం ఏపి ప్రభుత్వం తాకట్టు పెట్టిసింది.