ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనం డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్. ఆయన ఒక దళిత డాక్టర్. నర్సీపట్నం లాంటి ఏజెన్సీ ప్రాంతంలో, ఆయన మత్తు డాక్టర్ గా పని చేస్తూ, ఎంతో సేవ చేసే వారు. అయితే ఇలాంటి మంచి పేరు ఉన్న డాక్టర్ కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, పిచ్చి వాడిగా ముద్ర వేసి, చివరకు మానసిక వేదన అనుభవించి చనిపోయారు. ఆయన చావుకి, ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ బాధ్యులు అనే చెప్పాలి. క-రో-నా మొదటి వేవ్ సమయంలో, ఎవరికీ సరైన క్లారిటీ లేదు. క-రో-నా అంటే భయపడి పోయే పరిస్థితి. ఫీల్డ్ లో పని చేసే డాక్టర్లు అయితే, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. డాక్టర్ గా పని చేస్తున్న సుధాకర్, తమకు మాస్కులు కావలి అని అడిగారు. ఆయన్ను అవమానించారు. పక్కనే మీడియా ఉండటంతో, మీడియాతో బాధ పంచుకున్నారు. ఒక్క మాస్క్ అడిగితే ఇవ్వటం లేదని అన్నారు. అంతే ఈ వీడియో పిచ్చ వైరల్ అయ్యింది. ప్రభుత్వం కొడుకున్న డబ్బాకు , వాస్తవ పరిస్థితికి తేడా ఉండటంతో, ప్రభుత్వం తట్టుకోలేక పోయింది. వెంటనే ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆయన చేసిన తప్పు ఒక మాస్క్ అడగటం. సస్పెండ్ చేసిన వార్త కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఎందుకు ఇలా ప్రభుత్వం, ఒక దళిత డాక్టర్ పై వెంట పడుతుందో ఎవరికీ అర్ధం కాలేదు.
చివరకు ఒక రోజు ఆయన చొక్కా లేకుండా, రోడ్డు మీద పడి ఉన్న వీడియోలు వచ్చాయి. ఆయన్ను పోలీసులు కొడుతున్నారు. చివరకు అదే రోజు అయన్ను పిచ్చి వాడిగా ముద్ర వేసారు. పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో టిడిపి మహిళా నేత వంగలపూడి అనిత జరిగిన పరిణామాల పై హైకోర్టుకు లేఖ రాసారు. హైకోర్టు ఆ లేఖను పరిగణలోకి తీసుకుని, ఈ కేసు పై సిబిఐ విచారణ చేయాలని ఆదేశించింది. సిబిఐ విచారణ చేస్తున్న సమయంలోనే, తీవ్ర మానసిక వేదనలో ఉన్న సుధాకర్ చనిపోయారు. అయితే నిన్న సిబిఐ కోర్టుకు కొన్ని సంచలన విషయాలు చెప్పింది. ఈ కేసులో విచారణ పూర్తి చేసామని, చార్జ్ షీట్ వేయటానికి అనుమతి కోరింది. ఈ కేసులో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించామని, వారి పేర్లు చార్జ్ షీట్లో పెట్టామని, వారిని ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని కోర్టుని కోరింది. అలాగే తుది నివేదికను కూడా కోర్టు ఇచ్చారు. కోర్టు అన్నీ పరిగణలోకి తీసుకుని, విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు ఈ అధికారులను ప్రాసిక్యూట్ చేస్తే, అసలు ఈ అధికారులకు ఎవరు ఆదేశాలు ఇచ్చేరు అనే విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సిబిఐ ఏమి చేస్తుందో చూడాలి.