రీల్ వెనక్కు తిప్పి, 2019 ముందుకు వెళ్తే, జగన్ మోహన్ రెడ్డి గారి మాటలు చెవుల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, విడతల వారీగా మందు షాపులు ఏత్తేస్తాను, కేవలం ఫైవ్ స్టార్ హోటల్ లోనే, మందు ఉండేలా, అది కూడా షాక్ కొట్టే ధరలు ఉండేలా చేస్తాను, డబ్బు ఉన్న వాడే మద్యం కొనుక్కుని, అక్కడే తాగి పడతాడు అంటూ, జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రచారానికి, ఆడవాళ్ళు ఓట్లు వేసారనే చెప్పాలి. అయితే ఎన్నికలు అయిన తరువాత, మొదటి ఏడాది అక్టోబర్ 2న 4,380 షాపుల నుంచి, 3,500 షాపులకు తగ్గించి, మొత్తం ప్రభుత్వమే నడిపేలా పాలసీ తీసుకుని వచ్చారు. అప్పట్లో అందరూ మద్య నిషేధం చేస్తున్నాడనే అనుకున్నారు. అప్పుడే మొదలైంది అసలు సినిమా. మంచి బ్రాండులు అన్నీ పోయాయి. ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్, ఇలా వింత వింత పేర్లతో మందు దిగింది. అవి తాగితే పేగు పూత, కడుపు మంట, నాలిక మంట. సర్లే ఏదో ఒకటి తాగుదాం అనుకుంటే, 50 రూపాయల క్వార్టర్, 200 చేసి పడేసారు. క-రో-నా మొదలై షాపులు అన్నీ కొన్ని నెలలు మూసేసి, మళ్ళీ తెరిచే సమయానికి మరి కొన్ని షాపులు తగ్గించి 2,934కు తెచ్చారు. మద్య నిషేధం ఏమో కానీ, ప్రభుత్వానికి వద్దంటే ఆదాయం, వేల కోట్ల ఆదాయం వచ్చి పడుతుంది.

gandhi 02102021 2

నెలకు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చి పడుతుంది. ఇప్పుడు 2021 అక్టోబర్ 2. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడో గాంధీ జయంతి. ఇంకేముంది, ఈ సారి కూడా షాపులు పూర్తిగా తగ్గించేస్తారు, వచ్చే ఏడాదికి ఇక ఫైవ్ స్టార్ట్ హోటల్స్ కు మాత్రమే పరిమితం అని డబ్బా కొట్టారు. అయితే నిన్న గాంధీ జయంతి సందర్భంగా, మందు బాబులుకు బంపర్ ఆఫర్ ఇస్తూ గజెట్ విడుదల చేసారు. మద్య నిషేధంలో భాగంగా ఈ ఏడాది ఒక్క షాపు కూడా మూయటం లేదు అంట. మొత్తం 2,934 షాపులు అలాగే ఉంటాయి. వీటికి తోడుగా కొత్తగా పర్యాటక ప్రాంతాల్లో షాపులు, వాన్ ఇన్ స్టోర్స్ వస్తున్నాయి. ఇది చూసిన వైసీపీ శ్రేణులు కూడా షాక్ అయ్యాయి. అసలు ఇదేమి మద్య పాన నిషేధం అంటూ, పెదవి విరుస్తున్నారు. ఒకపక్క రేట్లు పెంచి ,ఆదాయం భారిగా పెంచుకుని, ఇప్పుడు షాపులు కూడా తగ్గించకపోతే, ప్రజలకు ఏమి సమాధానం చెప్తాం అంటూ, సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తానికి గాంధీ జయంతి సందర్భంగా, జగన్ తీసుకున్న నిర్ణయంతో, వైసిపి శ్రేణులు తలలు బాదుకుంటున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read