హూ ఈజ్ ది డాన్ ఆఫ్ డ్ర-గ్ మాఫియా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరన్నది తేలాలని, గడచిన నాలుగు నెలల్లోనే రూ.2లక్షల కోట్ల విలువైన డ్ర-గ్స్ వ్యాపారం రాష్ట్రంలో జరిగిందని, దాని వల్ల ఎన్ని లక్షల మంది యువత నిర్వీర్యమైందో ఎవరూచెప్పడంలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనేయథాతథంగా మీకోసం..... ఐవరీకోస్ట్ ప్రాంతం సౌత్ కోస్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఆఫ్రికా లో కీలక ప్రాంతం. ఆ ప్రాంతాన్ని హెరాయిన్ హబ్ గా సిలుస్తారు. అలాంటి ప్రాంతానికి వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు వెళ్లారు? ఆయన ఏం చెబుతున్నారంటే అక్కడ తాను బియ్యం గోదాములు నిర్మించడంకోసం వెళ్లానంటున్నారు. తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేతకు అన్నాడట, ద్వారంపూడి లాంటి వ్యక్తే. ఆయన ఐవరీకోస్ట్ కు ఎందుకు వెళ్లారో తెలియాలి. డ్ర-గ్స్ గురించి చెబితేచాలు, డీజీపీ తనరెండు చెవులూ మూసుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు తాను చెప్పేది రెండు చెవులూ రిక్కించి మరీవినాలి. ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ కాందహార్, ఎక్కడి ఆంధ్రప్రదేశ్, ఎక్కడి విజయవాడ...? ఆఫ్ఘనిస్తా న్ లోని కాందహార్ లో గల హస్సన్ హుస్సేన్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూంటుంది. అక్కడి నుంచి బయలుదేరే డ్ర-గ్స్, మాదకద్రవ్యాలు తొలుత ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్టుకి చేరుతాయి. అక్కడి నుంచి సముద్రమార్గంలో గుజరాత్ లోని ముంద్రా పోర్టుకి చేరాయి. గుజరాత్ లోని ముంద్రా పోర్టుకి జూన్ లో 25 మెట్రిక్ టన్నుల హెరాయిన్ వచ్చింది. అక్కడి నుంచి కాకినాడలోని అలీషాకు చెందిన శాన్ మెరైన్ కంపెనీకి ఆ హెరాయిన్ చేరింది. అక్కడినుంచి విజయవాడలో ఉన్న ఆషీ ట్రేడింగ్ కంపెనీ యజమాని సుధాకర్ కు, 25 మెట్రిక్ టన్నుల (దానివిలువ సుమారు రూ.75కోట్ల విలువ ఉంటుంది.) హెరాయిన్ చేరింది. కాకినాడకు చెందిన అలీషా, వినోద్ అగర్వాల్ లు ఇద్దరూ బడా వ్యాపారులని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే స్వయంగా ఒప్పుకున్నారు. అషీ ట్రేడింగ్ కంపెనీ యజమాని సుధాకర్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి, అషీ అనే పేరు అతనెలా పెట్టాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మిత్రుడు, సుధాకర్ కు సన్నిహితుడైన షేక్ అలీషా కూతురిపేరు అషీ. అషీ అనేపేరు సుధాకర్ తనకంపెనీకి ఎందుకు పెట్టు కున్నాడని ఆరాతీస్తే, సదరు కంపెనీని అలీషానే రిజిస్టర్ చేయించాడని తెలిసింది. విజయవాడలోఉన్న అషీ ట్రేడింగ్ కంపెనీ కేవలం రెండు గదుల్లో మాత్రమే ఉంటుంది.
కానీ దాని కార్య కలాపాలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అషీ ట్రేడింగ్ కంపెనీ ఒక సూట్ కేసు కంపెనీ. కాకినాడకు వచ్చిన హెరాయిన్ అక్కడి నుంచి చెన్నైకు చేరుతుంది. చెన్నైలో వై.ఎస్.అనిల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన షాలోమ్ ఇండస్ట్రీస్ కు చేరుతుంది. సదరు అనిల్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు వరుస అవుతాడని చెబుతున్నారు. అవునో, కాదో ముఖ్యమంత్రే చెప్పాలి. ఆఫ్గనిస్తాన్ నుంచి గుజరాత్, గుజరాత్ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి చెన్నైకి, అక్కడి నుంచి ఐవరీకోస్ట్ కు హెరాయిన్ చేరుతుంది. అదే ఐవరీకోస్ట్ లో తాను బియ్యం గోదాములు నిర్మిస్తున్నానని వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన మాటలకు జరుగతున్న దానికి ఎక్కడా పొంతనలేదు. ఇంతభారీ మొత్తంలో డ్ర-గ్స్ వ్యాపారం ఏపీ కేంద్రంగా ఆఫ్ఘనిస్తాన్ టూ ఐవరీకోస్ట్ కు జరుగుతుంటే, డీజీపీ రాష్ట్రానికి ఏంసంబంధం లేదని బాధ్యత లేకుండా మాట్లాడవచ్చా? డీజీపీ వ్యాఖ్యలవల్ల, రాష్ట్రంలో జరుగుతున్న డ్ర-గ్స్ దందా వల్ల ఎన్నిలక్షలమంది యువత జీవితాలు నిర్వీర్యమవుతున్నాయో ఆయన ఆలోచించకపోతే ఎలా? అషీ ట్రేడింగ్ కంపెనీ కార్యకలాపాలు ఏవీ ఏపీలో లేవని డీజీపీ ఎలా చెప్పారు?
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతనికున్న సంబంధాలు, షేక్ అలీషా వ్యవహారం, అతనితో సుధాకర్ కు, వినోద్ అగర్వాల్ కుఉన్న సంబంధాలు, వారందరితో చెన్నైలోని షాలోమ్ ఇండస్ట్రీస్ వై.ఎస్.అనిల్ కుఉన్న సంబంధాలేమిటో పోలీసలుతేల్చరా? చెన్నైనుంచి ఐవరీకోస్ట్ కు జరుగుతున్న హెరాయిన్ రవాణాలో ఇంకెందరి ప్రమేయముందో తేల్చాల్సిన బాధ్యత ఏపీ పోలీస్ కు లేదా? మహమ్మద్ షేక్ అలీషా, తన కూతురిపేరుతో రిజిస్టర్ చేసిన కంపెనీకి సుధాకర్ ఎలా యజమాని అయ్యాడు. దాన్ని అతనెలా నిర్వహిస్తున్నాడనేది పోలీసులు కనిపెట్టరా? ఎక్కడి ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఆంధప్రదేశ్? ఎక్కడి కాందహార్ ఎక్కడి విజయవాడ? ఏమైనా సంబంధముందా అసలు? హెరాయిన్ రావడమేంటి? దాన్ని ఏపీ నుంచి మరోచోటికి సరఫరా చేయడమేంటి? డీజీపీ ఈ కేసుని సీరియస్ గా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మంది యువత ఇప్పటికే నిర్వీర్యమయ్యారు. మరి కొన్ని లక్షలమంది నిర్వీర్యమయ్యే ప్రమాదముంది. ఐవరీకోస్ట్ కు వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు వెళ్లారు ? ఈ వ్యవహారాలన్నీ తేల్చరా? అందుకే ప్రధానిమోదీ, కేంద్రహోం మంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నా? ఈ వ్యవహారం వెనకున్న వారెవరో తేలాలంటే ఎన్ఐఏకు (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలని ప్రధాని, కేంద్ర హోంమంత్రులను కోరుతున్నా.