ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌బీఐ షాక్ ఇచ్చింది. సుమారుగా, 6,500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వడానికి ఎస్‌బీఐ ఒప్పుకోలేదు. సీఎస్ఎస్ పథకాలు, అంటే కేంద్ర భాగస్వామ్యం ఉన్న పధకాలకు సంబంధించి, మ్యాచింగ్ గ్రాంట్ కోసం ఎస్‌బీఐని, ఓవర్ డ్రాఫ్ట్ కోసం ఏపి ప్రభుత్వం కోరింది. కానీ, ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వటం కుదరదు అంటూ, ఎస్‌బీఐ తేల్చి చెప్పింది. సీఎస్ఎస్ పథకాలకు సంబంధించి, కేంద్రం ఈ సంవత్సరం నుంచి, కొన్ని కొత్త నిబంధనలు తీసుకుని వచ్చింది. ఇప్పటి వరకు కూడా సీఎస్ఎస్ పథకాలకు సంబందించిన నిధులను కొన్ని రాష్ట్రాలు తమ తమ అవసరాలకు వాడుకుంటున్నాయని, సొంత అవసరాలకు రాష్ట్రాలు ఉపయోగించుకోకుండా, కొత్త నిబంధనలు పెట్టింది. ఈ సీఎస్ఎస్ నిధులను పీడీ ఖాతాలకు మళ్ళించకుండా, కొత్త నిబంధనలు పెడుతూ సీఎస్ఎస్ పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వలకు విడుదల చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి రాష్ట్రాలకు ఇవి చేరుతాయి. ఈ నిధులు రిజర్వ్ బ్యాంక్ కు చేరిన తరువాత, 21 రోజుల్లో నోడల్ ఏజెన్సీ ద్వారా, ఖాతాలకు బదలాయించాలి. కేంద్రం తన వాటా విడుదల చేసిన 40 రోజుల్లోగా రాష్ట్రం తన వాటాని విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని కూడా ఈ సింగల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లోనే వేయాల్సి ఉంటుంది.

sbi 30092021 2

ఒక పధకం నిధులు అన్నీ ఒకే బ్యాంకులో ఉండాలని, వాటి వినియోగం , ఖర్చు పై కూడా మ్యాపింగ్ జరగాలని కేంద్రం నిర్దేశించింది. నిర్దిష్ట సమయంలో కనుక, కేంద్ర రాష్ట్ర వాటాల నిధులు కలిపి ఖర్చు చేస్తేనే, తదుపరి నిధులు కూడా విడుదల అయ్యే విధంగా, కొత్త విధానాలను మార్చింది. ఈ రాష్ట్ర వాటా నిధులు భారాంయించేందుకే ఇప్పుడు ఏపి ప్రభుత్వం అనేక మార్గాల కోసం చూస్తుంది. ఇదే విషయం పై 6,500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కావాలని, ఎస్‌బీఐకి ఇటీవల రాష్ట్రానికి సంబంధించిన అధికారులుకోరగా, ఎస్‌బీఐ, రాష్ట్ర అధికారులకు తిరిగి షాక్ ఇచ్చే విధంగా లేఖ రాసింది. సీఎస్ఎస్ పథకాలకు సంబంధించిన ఖాతాలు మీ బ్యాంక్ లో తెరుస్తాం అని, అయితే మూలదానంగా ఉండే 6,500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ కింద ఇవ్వాలని ప్రభుత్వం కోరగా, ఎస్‌బీఐ మాత్రం తాము ఇంత ఓవర్ డ్రాఫ్ట్ కింద మీకు ఇవ్వలేం అని చెప్పటంతో, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అవమానం అనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి పై నమ్మకం లేకే, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, ఈ నిర్ణయం ప్రకటించి ఉండవచ్చని, ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read