ఈ రోజు అన్ని వార్తా పత్రికల్లో, వచ్చిన వార్త చూసి, ఏపి ప్రజలు ఉలిక్కిపడ్డారు. తెలుగు వార్తా పత్రికలే కాదు, దేశ వ్యాప్తంగా అన్ని వార్తా సంస్థలు, ఈ విషయం పై, వార్తలు ప్రచురించారు. ఏకంగా 9 వేల కోట్ల హెరాయిన్ పట్టుకున్న విషయంలో, విజయవాడకు లింక్ ఉందని తేలటంతో, అందరూ షాక్ తిన్నారు. దేశ చరిత్రలోనే, అత్యంత అతి పెద్ద భారీ డ్ర-గ్ సీజర్ కావటంతో, అందరూ షాక్ తిన్నారు. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు, భారీగా హెరాయిన్ పట్టుకున్నారు. దాదాపుగా 3 వేలు కేజీలు ఉండే ఈ హెరాయిన్ విలువ, ముందుగా 9 వేల కోట్లు అని, తరువాత 21 వేలు కోట్లు అని తేలింది. ఇది ఆఫ్గనిస్తాన్ లో నుంచి తాలిబన్లు పంపినట్టు, ఈ సరుకు విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ సంస్థకు వెళుతున్నట్లు గుర్తించారు. ఇదంతా టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో వస్తుంది. దీనికి సంబంధించి అధికారులు విజయవాడ వచ్చి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం మొత్తం విజయవాడ, కాకినాడ, చెన్నై వరకు ఉన్నట్టు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గుర్తించారు. ఇది ఇలా ఉంటే ఒక జాతీయ మీడియా ఇన్వెస్టిగేషన్ ప్రకారం, మరిన్ని వివరాలు బయటకు రావటంతో, అందరూ షాక్ తిన్నారు.

her 20092021 2

ఈ ఆషీ ట్రేడింగ్‌ సంస్థ, పోయిన ఏడాది జూన్ లో విజయవాడలో రిజిస్టర్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, దాదాపుగా 24 టన్నుల హెరాయిన్ ఈ సంస్థకు వచ్చిందని, దాని విలువ 72 కోట్లు అని గుర్తించామని, ఆ జాతీయ మీడియా ప్రకటీంచటంతో అందరూ షాక్ అయ్యారు. కాంధహార్ లో ఉన్న హాసన్ హుస్సేన్ లిమిటెడ్ కంపెనీ నుంచి హేరాయిన్ ని దిగుమతి చేసుకుంటున్నారని ఆ జాతీయ మీడియా కధనంలో వచ్చింది. అయితే ఈ ప్రచారాన్ని విజయవాడ పోలీసులు కొట్టి పారేసారు. విజయవాడకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ ఢిల్లీకి చెందిన వాళ్ళది అని, అడ్రస్ మత్రమే విజయవాడది ఉపయోగించారు అంటూ, విజయవాడ పోలీసులు చెప్పుకొచ్చారు. దీని పై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. అయితే విజయవాడ పోలీసులు చెప్పిన దానిలో స్పష్టత అయితే లేదు. అసలు విజయవాడ అడ్రెస్ ఎందుకు ఉంది ? పార్సిల్ మీద విజయవాడ అడ్డ్రెస్ గుర్తిస్తే, ఢిల్లీ వాళ్ళు ప్రమేయం ఏమిటి అనేవి తెలియాల్సి ఉంది. విచారణ తరువాత, ఏమి చెప్తారో చూద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read