మూడు రోజుల క్రితం, టిటిడి బోర్డుని నియమిస్తూ, ఒక జంబో బోర్డుని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ బోర్డులోని పేర్లు చూసి అందరూ షాక్ తిన్నారు. అందులో చాలా మంది పై కేసులు ఉన్నాయి. మొత్తం 80 మందితో జంబో బోర్డుని ప్రకటించింది. అయితే ఏపి నుంచి కొంత మంది నేతలు, కొంత మంది పారిశ్రామిక వేత్తల దగ్గరకు వెళ్లి, మీకు పదవి ఇస్తాం అంటూ, ఏవో ఏవో ఆఫర్లు ఇచ్చినట్టు, దానికి ప్రతి ఫలం గురించి టీవీ చానల్స్ లో వార్తలు వచ్చాయి. రాజకీయ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు ఆసిస్తూ, ఈ బోర్డు నిర్ణయం జరిగింది అని ప్రచారం జరిగింది. ఇంత పెద్ద బోర్డు ప్రకటన చూసి, అందరూ షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ నియామకాల విషయంలో పెద్ద స్కాం బయట పడింది. కొంత మంది కేంద్ర మంత్రులకు తెలియకుండానే, బీజేపీ నేతలకు తెలియకుండా, వాళ్ళు సిఫారుసు చేసారు అంటూ, టిటిడి బోర్డు మెంబెర్లుగా కేటాయించారు అంటూ, సంచలన వ్యార్తలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు చెప్పారని, వీళ్ళను ఎవరైనా మోసం చేసారా, లేదా వీళ్ళే ఇష్టా రాజ్యంగా చేసారా అనేది ఇప్పుడు బయట పడాల్సి ఉంది. ఇప్పుడు బయట పడిన విషయం ప్రకారం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జగన్ మొహన్ రెడ్డికి ఒక లేఖ రాస్తూ, అందులో సంచలన విషయాలు తెలిపారు.

ttd 18092021 2

టిటిడి బోర్డులోని ప్రత్యేక ఆహ్వానితుడి జాబితాలో తొమ్మిదో పేరు, రవి ప్రసాద్ అనే ఆయనకు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఫార్సు మేరకు, టిటిడి బోర్డు లో పదవి ఇచ్చినట్టు వీళ్ళు పేర్కొన్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలిసింది. తన ప్రమేయం లేకుండానే, తన పేరు ఉపయోగించి పదవి ఇవ్వటం పై, ఆశ్చర్య పోయారు. వెంటనే జగన్ మోహన్ రెడ్డికి లెటర్ రాసారు. అతని నియామకంలో నాకు సంబంధం లేదని, నా పేరు దుర్వినియోగం చేస్తూ పదవి ఇచ్చారని, తాను ఎలాంటి సిఫార్సు చేయలేదని, దీని పై పూర్తి విచారణ చేయాలని, చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఉత్తరంలో కోరారు. అయితే ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్ని ఉంటాయో అని పలువురు ఆశ్చర్య పోతున్నారు. తెలంగాణా రాష్ట్ర కేంద్ర మంత్రినే ఇలా చేసారు అంటే, ఇంకా పక్క రాష్ట్రం వాళ్ళవి చేస్తే తెలిసే అవకాసం లేదు. ఈ మొత్తం వ్యవహారం పై, ప్రభుత్వమా సమగ్ర విచారణ చేపించాలని, మొత్తం గుట్టు బయటకు రావాలని కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read