ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పులు ఇప్పుడు టాక్ ఈఫ్ ది నేషన్ కూడా అయ్యాయి. చిత్ర విచిత్రంగా అప్పులు తెస్తూ, కార్పోరేషన్ల ద్వారా అప్పులు తెస్తూ, కొన్ని అప్పులను కనీసం బడ్జెట్ లో కూడా చూపించని వైనం అందరినీ షాక్ కు గురి చేసింది. పయ్యావుల కేశవ్ అడిగిన ప్రశ్నలకు, పెట్టిన ప్రెస్ మీట్ లకు ప్రభుత్వం షేక్ అయిపొయింది. ఇప్పటికీ కేంద్రం రంగంలోకి దిగగా, ఇప్పుడు కాగ్ కూడా రంగంలోకి దిగింది. ప్రభుత్వం ఆర్ధిక పరంగా చేస్తున్న అవకతవకలను గుర్తించిన కాగ్, వాటి పై సమాధానం ఇవ్వాలని కోరుతుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. రాష్ట్ర ఫైనాన్స్ ప్రినిసిపల్ సెక్రటరీ రావత్ కు లేఖ, కాగ్ నుంచి లేఖ వచ్చింది. దాదాపుగా రూ.18,241 కోట్లకు సంబంధించిన లెక్కలు గురించి అడుగుతూ లేఖ రాసారు. అలాగే మూడు వేరు వేరు బిల్లులు ద్వారా 10,895.67 కోట్ల వరకు పీడీ ఎకౌంటులను డ్రా చేసారని, అవి ఎందుకు చేసారని కాగ్ ప్రశ్నించింది. అలాగే మరో 6,223.41 కోట్ల వరకు 63 పీడీ ఎకౌంటుల నుంచి అమ్మ ఒడి స్కీంకు మళ్ళించారని, దాని పై కుడా ఇవ్వరన ఇవ్వలని కాగ్ కోరింది. ఈ ట్రాన్స్ఫర్ లు, ఏ కోడ్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసారో చెప్పాలి అంటూ, కాగ్, ప్రభుత్వాన్ని కోరుతూ, పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరింది.

cag 1602021 2

అలాగే మరో 227.42 కోట్ల, రెండు బిల్లులు ద్వారా సెల్ఫ్ డ్రాల్ అంటూ తీసుకున్నారని, దీని పై కూడా వివరణ ఇవ్వాలని క్రాయింది. అలాగే కొన్ని బ్లాంక్ బిల్లులు ద్వారా 222 కోట్లు మళ్ళించారని, ఇలా ఎందుకు మళ్ళించారు, దేని కోసం మళ్ళించారో చెప్పాలి అంటూ, కాగ్ వివరణ అడిగింది. వివిధ బిల్లులకు సంబంధించి, సాంక్షన్ ఆర్డర్, ప్రొసీడింగ్స్, వర్క్ ఫ్లో వివరాలు ఇవ్వాలి అంటూ రాష్ట్రాన్ని కోరింది. మొత్తంగా వివిధ కార్పోరేషన్ల ద్వారా ఎన్ని రుణాలు, ఎలా తీసుకుని వచ్చారు, దేని కోసం ఖర్చు చేసారో చెప్పాలని కాగ్ కోరింది. అలాగే వాటికి ఎంత వడ్డీ చల్లిస్తున్నారు, ప్రభుత్వం ఏ రకమైన గ్యారంటీ ఇచ్చింది, లాంటి వివరాలు కూడా చెప్పాలని కాగ్ పేర్కొంది. అలాగే అప్పు తీర్చటానికి ఉన్న ఆదాయ వనరులు ఏమిటి అనే విషయం కూడా ప్రశ్నించింది. కొన్ని అప్పులు బడ్జెట్ లో చూపక పోవటం పై కూడా ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే కాగ్ ఈ లేఖ రాసినట్టు, తెలుస్తుంది. మరి వీటి మీద ప్రభుత్వం, ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read