పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీ ఎక్కువ స్ధానాలు గెలిచిందని వైసీపీ మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాయలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పరిషత్ ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీనే చేయలేదు. వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా ఎన్నికలు బహిష్కరింది. టీడీపీ ఎన్నికలు బహిష్కరిస్తే టీడీపీ కంటే ఎక్కువ సీట్లు గెలిచామని మంత్రులు ఏవిధంగా మాట్లాడుతారు? వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల్లో దా-డు-లు, దౌర్జన్యాలు, అరచకాలకు పాల్పడి ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్చను, చివరకు ఓటు హక్కును కూడా హరించారు. టీడీపీ అదికారంలో జరిగిన ప్రతిఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 2017 లో 9 ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ కేవలం 3 స్ధానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో అన్ని గెలిచాం. కడప ఎమ్మెల్సీ, నంద్యాల ఉప ఎన్నిక, 2015 లో గుంటూరు, క్రిష్టా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిచాం. కాకినాడ కార్పేషన్ల ఎన్నికల్లో 49లో స్ధానాల్లో 39 గెలిచాం. ప్రజల్ని మెప్పించి ఈ ఎన్నికల్లో గెలిచాం. కానీ వైసీపీ మాత్రం దా-డు-లు, దౌర్జన్యాలతో ప్రజల్న భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలిచింది. మాచర్లలో బోండా ఉమా, బుద్దా వెంకన్నపై దా-డి చేశారు, తెనాలిలో టీడీపీ అభ్యర్ధి ఇంట్లో మద్యం సీసాలు పెట్టి అక్రమ కేసులు పెట్టారు.
పుంగనూరులో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటుంటే..గిరిజనమహిళ బురాఖా వేసుకుని వెళ్లినా వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని ఆమెపై, ఆమె భర్తపై దా-డి చేసి చంపుతామని బెదిరించారు. పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72 శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది. రాష్ట్రం మెత్తం ఈ విధంగా దా-డు-లు, దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో గెలిచామని చెప్పుకోవటం సిగ్గుచేటు. గతంలో జయలలిత కూడా స్ధానిక ఎన్నికలను బహిష్కరించారు. రాష్ర్టంలో రాక్షస పాలన సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అరాచాకాలపై ముఖ్యమంత్రి ఒక్క గంట దృష్టి పెట్టలేరా? అన్నపూర్ణగా పేరొందిన ఏపీని బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ లతో పోటీపడే పరిస్థితి తెచ్చారు. చివరకు రైతులకు పండించిన పంటల్ని కూడా దళారులతో దోచుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 25 సీట్లు కూడా రావు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు.