రెండు రోజుల క్రితం జగన మోహన్ రెడ్డి, ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవాలి అంటూ, చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే. రెండున్నరేళ్ళ ముందే జగన్ ఈ మాటలు చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా, వచ్చే ఎన్నికల కోసమే అన్నట్టుగా ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని నిర్ణయాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత, తాను ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ ఆశించారు. అయితే అధిష్టానం మాత్రం, రోశయ్యకు సియం పదవి ఇచ్చింది. అప్పట్లో రోశయ్య పై జగన్ వర్గం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తనకు రావాల్సిన పదవి రోశయ్య కొట్టేసారని, జగన్ వర్గం రోశయ్య పై ఎదురు దాడి చేసి,ఒక అసమర్దుడిగా చిత్రీకరించింది. అయితే తరువాత కాలంలో రాజకీయాలు మారిపోయాయి. గవర్నర్ గా కూడా చేసిన రోశయ్య, ప్రస్తుతం వయోభారంతో, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే రోశయ్యకు ఆయన సామజికవర్గంలో మంచి పట్టు ఉంది. సరిగ్గా ఇదే ఇప్పుడు ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నారా అంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తే, అవును అనే సమాధానం వస్తుంది. రోశయ్యను మంచి చేసుకుంటే, రోశయ్య సామాజికవర్గానికి దగ్గర కావచ్చని వైసీపీలోని కొంత మంది ముఖ్యులు ప్లాన్ గా తెలుస్తుంది.

rosaiah 19092021 2

అందుకే ఇటీవల ప్రకటించిన టిటిడి బోర్డులో, పైడా కృష్ణ ప్రసాద్ అనే అతినికి కూడా చోటు కల్పించారు. ఈయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త, అలాగే విశాఖలో విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ఈయన ఎవరో కాదు, స్వయానా రోశయ్య అల్లుడు. గతంలో రోశయ్యను టార్గెట్ చేసి, ఇప్పుడు మచ్చిక చేసుకుంటున్నారు. ఈ నియామకం వెనుక విజయసాయి రెడ్డి హస్తం ఉందనే ప్రచారం జరుగుతుంది. విశాఖలో చీమ చిటుక్కుమన్నా విజయసాయికి తెలుస్తుందని, వచ్చే ఎన్నికల్లో విశాఖను ఎంపిగా పోటీ చేయాలని విజయసాయి భావిస్తున్న తరుణంలో, ఆయన సిఫారుసు మేరకే, ఈ నియామకం జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. విశాఖ అర్బన్ లో ఉన్న వైశ్య సామజికవర్గాన్ని మచ్చిక చేసుకోవటానికి, విజయసాయి రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకునట్టు చెప్తున్నారు. పైడా కృష్ణ ప్రసాద్ అనేక విద్యాసంస్థలు కూడా ఉండటంతో, విశాఖకు రాజాధానిని తరలించిన తరువాత, కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆ బిల్డింగ్లలో ఉంటాయానే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి గతంలో ఎవరిని అయితే దించటానికి ప్రయత్నించారు, ఇప్పుడు ఆ రోశయ్యనే మచ్చిక చేసుకుంటున్నారు. ఇదే కదా రాజకీయం అంటే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read