ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నిధులతో నడిచే ప్రాజెక్ట్ లు ఇక నుంచి ఆగిపోనున్నాయి. ఎందుకు అంటే, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నిధులతో నడిచే పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ లు తమకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించటం లేదని చెప్పి, ఇతీవిల వారు ఆయా ఆర్ధిక సంస్థలకు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన అంతర్జాతీయ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ పరిధిలో ఉండే డిపార్ట్మెంట్ అఫ్ ఎకనమిక్ అఫైర్స్ కు ఘాటుగా లేఖ రాసాయి. తాము ఏమైతే నిధులు విడుదల చేస్తున్నామో, ఆ నిధులు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపుతూ ఉంటే, అలాగే కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీగా ఉంటే, ఈ ప్రాజెక్ట్ లకు సంబంధించి, తాము విడుదల చేసే నిధులు, పనులు చేస్తున్న కాంట్రాక్టర్ లకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక పోవటం ఏమిటి, దీనికి మీ సమాధానం ఏమిటి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు నిలదీశాయి. దీని పై కేంద్రం కూడా సీరియస్ అయ్యింది. కేంద్ర ఆర్ధిక శాఖతో పాటుగా, డిపార్ట్మెంట్ అఫ్ ఎకనమిక్ అఫైర్స్ కూడా తీవ్రంగా స్పందించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గత వారం లేఖ రాసింది. ఈ ప్రాజెక్ట్ లకు సంబంధించిన రూ.960 కోట్లకు ఆయా సంస్థలు విడుదల చేసిన నిధులకు లెక్కలు చెప్పాలని కేంద్రం ఘాటుగా లేఖ రాసింది.
లెక్కలు చెప్పని పక్షంలో, తాము భవిష్యత్తులో విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి వచ్చే నిధులకు కౌంటర్ గ్యారెంటీ ఉండమని, ఎట్టి పరిస్థితిలోను ఇక మీకు నిధులు రావని, దీని వల్ల externally aided projects నిధులు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉందని చెప్పి, ఆ లేఖలో తెలిపారు. అందు వల్ల ఈ రూ.960 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఎకౌంటు లో ఉన్నట్టు చూపిస్తున్నా, పనులు చేసిన కాంట్రాక్టర్ లకు ఎందుకు నిధులు ఇవ్వలేక పోతున్నారని, అదే విధంగా, వీటికి సంబంధించి, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ ప్రాజెక్ట్ కింద ఎంత ఖర్చు పెట్టారు అనే విషయం పై తమకు పూర్తి సమాచారం కావాలని కూడా కేంద్ర ఆర్ధిక శాఖ, ఏపికి రాసిన లేఖలో పేర్కొంది. అదే విధంగా, ఎవరు అయితే తమకు ఫిర్యాదు చేసారో, ఆ వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించాలని, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు, కేంద్రాన్ని కోరాయి. ఈ నేపధ్యంలోనే, ఈ లేఖకు ఇప్పుడు ఏపి సరైన సమాధానం ఇవ్వని పక్షంలో, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుంచి వచ్చే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది.