కేసులున్న ప్రజాప్రతినిధుల కేసులను ఏడాది లోగా విచారణ పూర్తి చేయాలి అంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో కేంద్రం సహకారం లేకపోవటంతో, ఇది ముందుకు వెళ్ళ లేదు. దీంతో కేసులున్న ప్రజా ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాగే సాగదీయవచ్చు అని అనుకున్నారు. అయితే అనూహ్యంగా సుప్రీం కోర్టు ఈ రోజు వారికి షాక్ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రతినిధుల పై దాఖలైన సత్వర విచారణకు సంబందించిన పిటీషన్ ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి గతంలో సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరీ తన నివేదికను సుప్రీం కోర్టుకు అందచేసారు. అయితే సత్వర విచారణకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలి అంటూ, గత ఏడాది నవంబర్ లో కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. అయితే కేంద్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి కౌంటర్ వేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పక పొవటం, బాధ్యతారాహిత్యంగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. కేంద్రం ఈ విషయం చాలా తేలికగా తీసుకుందని, ఈ కేసు విచారణ ఎంత త్వరగా పూర్తవ్వాలని అందరూ కోరుకుంటుంటే, కేంద్రం ఇప్పటి వరకు తమ వైఖరి చెప్పలేదని అన్నారు.

nvramana 10082021 2

అయితే ఈ కేసులకు సంబంధించి, విచారణ తొందరగా అవ్వాలి అంటే, ప్రత్యేక ధర్మాసనం నియమించాలి అంటూ విజ్ఞప్తులు వస్తున్న నేపధ్యంలో, దీని పై కూడా తొందర్లోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే మరో అంశం కూడా సుప్రీం కోర్టు స్పందిస్తూ, పలు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల పై దాఖలు అయిన కేసులను ఉపసంహరించుకుంటున్నాయని, అలా ఉపసంహరించుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కొంత మంది సుప్రీంని కోరటంతో, ఈ విధంగా హైకోర్టుల అనుమతి లేకుండా, ఈ విధంగా కేసులు ఉపసంహరణ చేయకూడదు అంటూ, సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే మరో సంచలన ఆదేశం కూడా ఇస్తూ, ఈ కేసులు విచారణ చేస్తున్న న్యాయమూర్తులు కేసు అయ్యేంత వరకు రిటైర్డ్ అవ్వటం కానీ, బదిలీ అవ్వటం కానీ కుదరదు అనే అంశం కూడా తెలియ చేసారు. అయితే కేంద్రం పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పది రోజుల్లోగా కౌంటర్ వేయాలని, ఇదే చివరి అవకాసం అని హెచ్చరించారు. ఈ కేసుని 25వ తేదీకి వాయిదా వేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read