మరోసారి, మరో రోజు, మళ్ళీ అదే తీరు. ఈ రోజు కూడా హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండి పడింది. గ్రామీణ ప్రాంతాల్లో, పురపాలక సంఘాల్లో, నగర పాలక సంస్థల్లోని, ప్రభుత్వ స్కూల్స్ ప్రాంగణాల్లో, సచివాలయ భవనలు, రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు నిర్మించటం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే, ప్రభుత్వ స్కూల్స్ లో, ఇటువంటి భవనాలు నిర్మించవద్దు అని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, వాటిని ఉల్లఘించి నిర్మాణాలు చేయటమే కాక, ఈ రోజుకీ కూడా నిర్మాణాలు కొనసాగిస్తూ ఉండటం పై, హైకోర్టులో అయుదు కోర్టు ధిక్కరణ పిటీషన్లు నమోదు అయ్యాయి. వీటి అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, నలుగురు అధికారుల పై సీరియస్ అయ్యి, వారు కోర్టు ముందు హాజరు కావాలి అంటూ గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో ఈ పిటీషన్ విచారణకు రావటంతో, నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు హైకోర్టు ముందు హాజరు అయ్యారు. ఇలా కోర్టు ధిక్కరణ కేసు కింద, ఇంత మంది ఐఏఎస్ ఆఫీసర్లు హాజరు కావటం చాలా అరుదు అనే చెప్పాలి. ఈ నలుగురులో, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్, పురపాలక శాఖ సెట్రటరీ శ్రీలక్ష్మీ, గతంలో పురపాలక శాఖలో పని చేసిన విజయ్‍కుమార్, వీళ్ళు నలుగురు హాజరు అయ్యారు.

hc 09082021 2

అయితే ఇరిగేషన్ అధికారులు కూడా, కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, తమకు హైదరాబాద్ లో , కృష్ణా, గోదావరి బోర్డుతో మీటింగ్ ఉంది కాబట్టి, తాము హాజరు కాలెం అంటూ, కోర్టుకు తెలిపారు. అయితే హాజరు అయిన నలుగురు అధికారుల పై హైకోర్టు ఆగహ్రం వ్యక్తం చేసింది. పేద పిల్లలు చదువుకునే స్కూల్స్ లో, రాజకీయ వాతావరణం ఎలా సృష్టిస్తారు అని ప్రశ్నించింది. స్కూల్ వాతవరణాన్ని కలుషితం చేస్తున్నారని కూడా హైకోర్టు ఆగహ్రం వ్యక్తం చేసింది. మీలో ఎవరైనా జెడ్పీ స్కూల్స్ లో కానీ, ఏదైనా ప్రభుత్వ స్కూల్ లో చదువుకున్నారా అని ప్రశ్నించింది. అలా చదువుకుంటే ఆ బాధ ఏంటో మీకు తెలిసేదని చెప్పింది. తాము అదే ప్రభుత్వ స్కూల్ చదివి, ఇక్కడ వరకు వచ్చామని, జడ్జి పేర్కొన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని తాము భావిస్తున్నాను అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, ఆగష్టు 31వ తేదీన, అధికారులు అందరూ మళ్ళీ కోర్టు ముందు హాజరు కావాలి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read