ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, ఈ మధ్య కాలంలో, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక చట్ట విరుద్ధమైన పనుల పై, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 200కు పైగా చట్ట వ్యతిరేకమైన అంశాల్లో హైకోర్టులో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు హైకోర్టు ఆగ్రహానికి గురి అయ్యేలా చేసింది. దీంతో ఈ రోజు హైకోర్టు కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంచలన ఆదేశాలు ఇవ్వటం, చర్చనీయంసం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే అలవాటు పడిపోయింది కాబట్టి, ఇది కొత్త కాదు కానీ, కేంద్రంలో అధికారులు కూడా ఇలా కోర్టు ఆగ్రహానికి ఎందుకు గురి కావాల్సి వచ్చిందో ఆలోచించుకోవలసిన అంశం. ఈ రోజు ఉపాధి హామీ నిధులు అంశం, పై ఈ రోజు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గత నెలల్లో హైకోర్టు రెండు సార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు సంబంధించి, సరైన అఫిడవిట్ దాఖలు చేయకపోవటం పై ఈ రోజు రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శికి మేమో జారీ చేస్తామని, అలాగే అతని పై నాన్ బెయిలబుల్ కేసు కూడా బుక్ చేస్తామని హెచ్చరించింది.

hc center 10082021 2

వెంటనే అతన్ని కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ దశలో కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సోలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుని, వారం రోజుల్లో కోర్టు అడిగిన పూర్తి సమాచారం అంద చేస్తామని ఆయన హైకోర్ట్ ని అభ్యర్ధించారు. ఈ దశలో రాష్ట్ర హైకోర్టు, ఈ కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. అయతే వాయిదా వేసే క్రమంలో, హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా, రాష్ట్రంలో ఉపాధి హామీ కింద జరిగిన పనులు, ఎంత విలువ, ఎన్ని బిల్లులు చెల్లించారు, సంవత్సరాలు వారీగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17 లోపు ఆ ప్రమాణ పత్రం దాఖలు చేయాలని, అలా దాఖలు చేయని పక్షంలో వచ్చే వాయిదా నాటికి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హాజరు కావాల్సి ఉంటుందని, ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ కూడా జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. అయితే కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఈ లోపే మేము అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పటంతో, హైకోర్టు కేసుని వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read